జయలలిత ఆరోగ్యంపై పిటిషన్ కొట్టివేత...
posted on Oct 6, 2016 @ 11:50AM
జయలలిత ఆరోగ్యంపై వేసిన పిటషన్ ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. జయలలిత ఆరోగ్యం పై వివరణ ఇవ్వాలని.. ఫొటోలు విడుదల చేయాలని పిటిషన్ వేయగా దీనిని విచారణకు స్వీకరించిన రెండు నిమిషాల్లోనే పిటిషన్ ను తోసిపుచ్చింది. చికిత్స ఎన్ని రోజులు అన్నది ఎవరూ చెప్పలేరని.. ఆరోగ్యం మెరుగుపడటానికి ఇన్ని రోజుల సమయమంటూ ఏమీ ఉండదని తెలిపింది. చికిత్స పొందుతున్న వ్యక్తి యొక్క ఫొటోలను విడుదల చేయాలని కోరటం తగదని సూచించింది. పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లా లేదు.. పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లా ఉందని..ఇలాంటివి రాజకీయాల కోసం వాడుకోవద్దని పిటిషనర్ కు సూచించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. దిల్లీ ఎయిమ్స్‌నుంచి ముగ్గురు ప్రత్యేక వైద్యులు గురువారం ఉదయం అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. వూపిరితత్తుల వ్యాధి నిపుణుడు, హృద్రోగ నిపుణుడు, మత్తు వైద్య నిపుణులు కిల్మాని, నితీశ్‌నాయక్, అంజన్‌లు ఇప్పటి వరకూ జయకు నిర్వహించిన వైద్యపరీక్షల నివేదికలు పరిశీలిస్తున్నారు.