ISIS తీవ్రవాదుల జీతాల తగ్గింపు
posted on Feb 9, 2016 @ 11:44AM
ప్రపంచమంతా ఏకమై ఇప్పడు ISIS మీద విరుచుకుడటంతో, ఆ సంస్థ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. దాంతో తన సైనికులకు అందించే జీతాలను కూడా సగానికి సగం తగ్గించాల్సి వచ్చింది. సిరియా, ఇరాక్ దేశాలలో తను ఆక్రమించిన చాలా ప్రాంతాలను ISIS ఖాళీ చేయాల్సి రావడంతో… ఈ మద్య ISIS బాగా నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరాజయాల వల్ల నెలనెలా కోట్లాది రూపాయల ఆదాయం లభించే చమురు బావులు కాస్తా ఆ సంస్ఘ నుంచి చేజారిపోయాయి. ఒకప్పుడు నెలకి 20-60 వేల వరకూ జీతాలను అందించిన ISIS, ప్రస్తుతం వాటిలో సగానికి పైగా కోతని విధించాల్సి వచ్చింది. ఒకపక్క వరుస పరాజయాలు, మరో పక్క వైమానిక దాడులలో మరణిస్తున్న సైనికులు…. వీటన్నింటి మధ్యా జీతాలను కూడా తగ్గించేయడంతో ఇప్పడు ISISలో పనిచేస్తున్న సైనికులు కొందరు నిదానంగా జారుకుంటున్నట్లు సమాచారం! అందుకని ఆ సంస్థ ఇప్పడు తక్కువ జీతంతో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల కోసం ఎదురుచూస్తోంది.