చంద్రబాబు చాలా మంచి నాయకుడే కానీ...
posted on Feb 9, 2016 @ 11:26AM
టీడీపీ కుత్బాల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పార్టీకి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా టీడీపీ అఫీసుకి తన రాజీనామా లేఖ పంపారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో.. క్యాంపు ఆఫీసులోనే టీఆర్ఎస్ లోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితమయ్యారు.. ఆయన లేని లోటు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందని, చంద్రబాబు చాలా మంచి నాయకుడని, తమ పార్టీకి కూడా ప్రజల్లో మంచి పేరు ఉందని, కానీ ఇప్పుడు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని అందుకే తాను తెరాసలో చేరానని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. అంతేకాదు సీఎం కేసీఆర్ పై కూడా ప్రశంసలు కురిపించారు. హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దడం ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యమని.. కెసిఆర్ సంక్షేమ పథకాలు ప్రజలు మెచ్చేవిగా ఉన్నాయన్నారు. ఆ సంక్షేమ పథకాలు తనకు నచ్చాయని చెప్పారు.