ఒంటరైన ఇరోమ్ షర్మిల.. మొన్న జేజేలు... నేడు తిట్లు..
posted on Aug 12, 2016 @ 11:21AM
సాయుధ బలగాల అధికారాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇరోమ్ షర్మిలా 16 ఏళ్లు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె తన దీక్షను విరమించారు. అయితే ఇన్ని సంవత్సరాలు ఎవరైతే ఆమెను పొగిడారో.. ఇప్పుడు వారో తనను విమర్శించే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 16 ఏళ్లుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన లేదని.. తాను దీక్ష చేసినా లాభం లేదని భావించి ఆమె దీక్ష విరమించారు. దీక్ష విరమించి తాను రాజకీయాల్లోకి రావాలని.. తద్వారా తాను అనుకున్నది సాధించాలని ఆమె ప్రకటించారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఆమె తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆమెపై తాము గంపెడాశలు పెట్టుకుంటే నిలువునా ముంచిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏఎఫ్‌ఎస్‌పీఏపై గతంలో ఎందరో రాజకీయ నాయకులు పోరాడి ఓడిపోయారని, ఇప్పుడు షర్మిల విషయంలోనూ అదే జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నా. అంతేకాదు అఖరికి ఆమె ఉంటున్న ప్రాంతాన్ని కూడా చేయమని.. ఇక్కడ ఉండద్దు అని మరీ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. దీంతో ఇరోమ్ ఒంటరైపోయింది. అయితే ఆమెకు షెల్టర్ ఇవ్వడానికి రెడ్‌క్రాస్(మణిపూర్) ముందుకొచ్చింది.
అయితే షర్మిల దీక్ష విరమించడానికి గల కారణం వేరే ఉందన్న వాదన కూడా వినిపిస్తుంది. తాను కనుక ఎన్నికల్లో ఓడిపోతే పెళ్లి చేసుకుంటానని షర్మిల చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యక్తి ఎవరంటే.. భారత్‌లో పుట్టిన బ్రిటిష్ జాతీయుడు దేశ్‌మండ్ కౌటినో. ఈయనే ఒక విధంగా ఆమె దీక్షను భగ్నం చేయడానకి కారణమని అంటున్నారు. మొత్తానికి నిన్న మొన్నటి వరకూ జేజేలు కొట్టిన ప్రజలే.. ఇప్పుడు తిడుతుండటం ఆశ్చర్యకరమైన విషయం..