బీజేపీ నేత కాన్వాయ్ పై కాల్పులు.. ఏకే-47తో వంద రౌండ్లు
posted on Aug 12, 2016 @ 11:39AM
భాజపా సీనియర్ నేత సీనియర్ నేత కాన్వాయ్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్లో బీజేపీ నేత బ్రిజ్‌పాల్ టియోటియా కాన్వాయ్ పై దుండగులు దాడి చేసి ఏకే-47తో దాదాపు వంద రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో బ్రిజ్‌పాల్ తీవ్రంగా గాయపడగా ఆయనను నోయిడాలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలుపుతున్నారు. ఇంకా ఈ దాడిలో బ్రిజ్‌పాల్ తో పాటు మరో ఐదుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సందర్బంగా ఇన్‌స్పెక్టర్ జనరల్ సుర్జీప్ పాండే మాట్లాడుతూ.. టొయోటా ఫార్చ్యునర్ ఎస్‌యూవీలో వచ్చిన దుండగులు బ్రిజ్‌పాల్ ఉన్న స్కార్పియో వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని.. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారని.. కాల్పులకు ఏకే-47లను ఉపయోగించారని.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.