వర్షం సాక్షిగా ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్
posted on Oct 26, 2022 @ 3:34PM
మెల్బోర్న్ లో బుధవారం జరిగిన సూపర్ 12 విభాగం మ్యాచ్ లో ఇంగ్లండ్ తో తలపడిన ఐర్లాండ్ ఆట మొత్తం ఆధి పత్యం చెలాయించింది. ఐర్లాండ్ తమ ఇన్నింగ్స్ లో 157 పరుగులు చేసింది. బాల్బ్రీని రెచ్చిపోయాడు. చాలా కాలం తర్వాత ఐర్లాండ్ మంచి బ్యాటర్ పొందిందని ప్రశంసించారు. చాలాకాలం క్రితం బెంగుళూరులో భారత్ మీద ఐర్లాండ్ సూపర్ స్టార్ కెవిన్ ఒ బ్రెయిన్ అద్బుత ప్రదర్శన తర్వాత ఇన్నాళ్లకు ఇప్పుడు టీ2 ప్రపంచ కప్ లో బాల్బ్రీన్ రూపంలో మరో బ్రహ్మాండమైన బ్యాటర్ లభించాడు. అతను అత్యధికంగా 62 పరుగులు, చేసి జట్టు విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 14.3 ఓవర్లలో 105 పరుగులే చేసింది. మలాన్ 35 పరుగులు చేశాడు. అయితే డి ఎల్ ఎస్ విధానంలో ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు.
వాస్తవానికి మ్యాచ్ చాలా భాగం ఐర్లాండ్ ధాటికి అంత పెద్ద ఇంగ్లండ్ ఒణికిందనాలి. జోష్ లిటిల్ కొత్త బంతితో స్వింగ్ చేస్తుంటే ఇంగ్లండ్ బ్యాటర్లు తమ మెల్బోర్న్పిచ్ మీదనే ఎదుర్కొనలేక భయపడ్డా రనాలి. అలాగే బెన్ స్టోక్స్ ను అరికట్టడంలో కొత్త కుర్రాడు ఫియాన్ హాండ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శిం చాడు. మరో వంక లెగ్ స్పిన్నర్ గరెట్ డాలానీ ఇంగ్లండ్ రన్ రేట్ ను దెబ్బతీశాడు. అయితే మోయిన్ ఆలీ 15వ ఓవర్లో కొట్టిన సిక్స్ తో ఇంగ్లండ్ కి ఆశలు కలిగించాడు. అప్పటికి ఇంగ్లండ్ విజయానికి కేవలం 5 పరుగుల దూరంలో ఉన్నారు. అప్పుడే వర్షం పడి వారి ఆశలను దెబ్బతీసింది. వర్షం తగ్గడం, రావడం.. ఈ దోబూచులాటల మధ్యలో స్టిర్లింగ్, క్రిస్ ఓక్స్ బాగా ఆడారు.
కానీ లొర్కాన్ టకర్ స్పిన్నర్లనే కాదు పేసర్లను కూడా బాగా ఎదుర్కొగలనని నిరూపించాడు. అతను 27 బంతుల్లో 37 పరుగులు చేశాడు. 16వ ఓవర్ లో బాల్బ్రీనీ వెనుదిరిగే సమయానికి ఐర్లాండ్ 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆ తర్వాత 157 పరుగులకు ఇన్నింగ్స్ ముగించింది. పదే పదే వర్షం అడ్డుపడి ఆట ఫలితాన్ని డెక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు.