ఇండియాలో విదేశీ వర్సిటీ బ్రాంచ్ లు.. మోడీ సర్కార్ కసరత్తు
posted on Jan 6, 2023 @ 5:06PM
ప్రపంచ ప్రసిద్ధి చెందిన వర్సిటీలు తమ క్యాంపస్ లను ఇండియాలో ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించేందుకు కసరత్తు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడి ప్రసిద్ద విశ్వవిద్యాలయాలలో చదవాల్సిన అవసరం లేకుండా ఆయా క్యాంపస్ లు ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆక్స్ ఫర్డ్, స్టాన్ఫోర్డ్, యేల్ తదితర యూనివర్సిటీలు ఇండియాలోనే తమ క్యాంపస్ లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంది. ఇందుకు సంబంధించిన ముసయిదా డ్రాఫ్ట్ ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇప్పటికే రూపొందించింది. ఆ ముసాయిదాను త్వరలోనే పార్లమెంటు ఆమోదానికి యూజీసీ పంపనుంది. ఈ వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి అధికారాలు కల్పించనుంది. అంటే భారత్ లో క్యాంపస్ లు ఏర్పాటు చేసే ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వ విద్యాలయాలు బొధనా సిబ్బందిని తామే స్వయంగా నియమించుకునే వెసులు బాటు ఉంటుంది.
విదేశీ యూనివర్సిటీలు స్థానిక సంస్థలతో భాగస్వామ్యం లేకుండానే సొంతంగా ఇండియన్ బ్రాంచ్ ను ప్రారంభించే వెసులు బాటు ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలను భారతీయ విద్యార్థులు స్వదేశంలోనే అందుకునేలా మోడీ సర్కారు ప్రయత్నాలు చస్తోంది. భవిష్యత్తులో మ ఇండియా గ్లోబల్ స్టడీ డెస్టినేషన్ గా నిలవాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటోంది.
2022 గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ నెస్ ఇండెక్స్ ప్రకారం 133 దేశాలలో ఇండియా ర్యాంకు 101 స్థానంలో ఉంది. దీనిని మెరుగుపరచాలంటే.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యావకాశాలు భారత్ లో అందుబాటులోకి తీసుకురావడమొక్కటే మార్గంగా మోడీ సర్కార్ భావిస్తోంది.