బీజేపీ వారి భక్తి పిచ్చి
posted on Sep 20, 2022 @ 3:14PM
పెద్దాయనకు నాగేస్సర్రావంటే ఇష్టం, బబ్లూకి చిరు అంటే వీరాభిమానం, పింకీకి చర్రీ అంటే..! వీరాభి మానం వింతపోకడలే పోకూడదు. సినిమాహాల్లో కాయితాలు చింపి ఎగరేయడం, ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేయడం వరకూ భరించొచ్చు. ఏకంగా గుడికట్టడంతో పిచ్చి పాకానపడిందని అర్ధం.
ఇప్పటికే సినీస్టార్లకు గుడికట్టి ఇలాంటి పిచ్చితనాన్ని ఎంతో శాతం ప్రదర్శించారు. గుడికట్టి ఏం చేస్తార న్నది వేరే విషయం. మనసులో కట్టాల్సింది బయటకడితేనే పెద్ద సమస్య. ఎందుకంటే ఎగస్పార్టీ వోరు కూలదోస్తే మనసు విరిగి ఆత్మహత్యలదాకా వెళ్లకుండా ఉంటే చాలు. వీరాభిమానం ప్రాణాలు తీసుకునే స్థితి కి దిగజార్చకూడదు. ఇపుడు కొత్తగా తెరమీదకి వచ్చిన గుడిదేవుడు యోగి ఆదిత్యానాథ్!
రాజకీయాల్లో ఇలాంటి పిచ్చి ఎంతవరకూ దారితీస్తుందనేదానికి సమాధానం లేదు. పార్టీ నాయకునిగా తనకు దేవుడిగా భావించే ఆ పార్టీ వీరాభిమాని మహా అయితే వీధిలో వాళ్లచేత ఓటు వేయించి ఆనందిం చొచ్చు. అంతకుమించి వీరాభిమానికి దక్కే సంతృప్తి ఉండదు. కానీ గుడి కట్టుకుంటే దేవుణ్ణి చూసినట్టు రోజూ చూసుకుంటూ, తన వీధిలో తనతో ఉన్నట్టు భావించుకుని రెండింతల ఉత్సాహంతో పార్టీ విజయా నికి పని చేయవచ్చు. ఇలాంటి వారిని పార్టీ నాయకులు పెద్దగా కాదనరు. వారికి ఇలాంటి పిచ్చాళ్లే బాగా అవసరం. వీరివల్ల ప్రచారం రెండింతలు అవుతుంది గదా!
అయోధ్యకు చెందిన ప్రభాకరన్ మౌర్య అనే వ్యక్తి మాత్రం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌పై ఉన్న అభి మానంతో ఏకంగా గుడినే కట్టించారు. బాణం, విల్లు పట్టుకొని కాషాయ వస్త్రాధారణతో సీఎం యోగి విగ్రహాన్ని గుడిలో ఏర్పాటుచేశారు. రోజూ ఉదయం, సాయంత్రం ఆ విగ్రహానికి పూజలు కూడా చేస్తు న్నారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదం పంచుతున్నారు. బీజేపీవారికి తెలిసిన దేవుడు రాముడే కనుక నాయకుడిని కూడా రాముడిగానే ఊహించుకున్నాడు సదరు వీరాభిమాని. దీనికి యోగిగారు ఏమాత్రం అడ్డు చెప్పకపోవడమే ఇక్కడ తలెత్తే ప్రశ్న. ముఖ్యమంత్రిగారు యోగి అయిన పుడు రాము డిలా విల్లంబు లు, బాణాలతో కాషాయి వస్త్రంతో విగ్రహం ఏర్పాటును ఎలా అంగీకరిస్తారు. అది పార్టీకి ఎంతవరకూ పనికి వస్తుంది. విపక్షాలు విరుచుకుపడతాయన్న ఆలోచనా రాలేదా? అనే ప్రశ్నలకు వీరాభిమాని కోరికకు బొత్తిగా సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే అది యోగీని అడిగి మరీ ఏర్పర చినది కాదని పార్టీ ఇతర వీరాభిమానుల సమాధానం.
అయోధ్యలో రాముడి జన్మభూమికి 25 కి.మీల దూరంలో భరత్‌కుండ్ సమీపంలో ఫైజాబాద్- ప్రయాగ్ రాజ్ హైవే వద్ద ఈ గుడిని నిర్మించారు. రాముడికి గుడి క డుతున్న యోగీజీకి తాము గుడి కట్టామని మౌర్య అన్నారు. యోగీ ప్రజల కోసం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు తనను ఆకర్షించాయని, అం దుకే ఆయనకు గుడి నిర్మించాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. తనకు ఉద్యోగం లేదని, భూమి లేదని అయినా యూట్యూబ్‌లో భజనలు, భక్తిగీతాలు పోస్టుచేస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తు న్నానని తెలిపారు. ఆ డబ్బుతోనే ఈ గుడి నిర్మించానని మౌర్య చెప్పారు.
ఈ తరహా భజనపరులు, వీరభక్తులు, మతం పిచ్చాళ్లతో బీజేపీ పార్టీ నిండిపోతే మామూలు ఓటరుకు గెలిపించాలన్న ఆలోచన పోతే మోదీ, షా ఏం చేస్తారు? ఇప్పటికే బీజేపీ అంటే మతపిచ్చితో ముందుకు వెళుతూన్న పార్టీ అని ముద్రపడింది. ఇపుడు ఇలాంటి బక్తాగ్రేసరులు పార్టీ ఫాలోయర్స్‌గా ఉంటే పార్టీ రాజకీయసమాలోచన సమావేశాల కంటే పురాణ కాలక్షేప సమావేశాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. మరి భక్తి తత్వంలో పడితే సామాన్య ఓటరు ఎందుకు ఓటు వేస్తాడు?