పాక్ హ్యాకర్లకు చెమటలు పట్టిస్తున్న భారత హ్యాకర్లు..
posted on Oct 7, 2016 @ 12:34PM
పాక్ భూభాగంలోకి చొరబడి..సర్జికల్ దాడులు జరిపి పలువురు ముష్కరులను మట్టుబెట్టి భారత సైన్యం పాక్ కు చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు తాము కూడా పాక్ చెమటలు పట్టిస్తాం అంటున్నారు భారత హ్యాకర్లు. పాకిస్థానీ ప్రభుత్వ నెట్‌వర్క్‌లోకి సమర్థంగా ప్రవేశించిన హ్యాకర్లు వాళ్ల కంప్యూటర్లు, డేటా మొత్తాన్ని లాక్ చేసేస్తున్నారు. దాంతో ఏం చేయాలో తెలియక పాక్ సైబర్ నిపుణులు తల పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత హ్యాకర్లకు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. తమ కంప్యూటర్లను అన్‌లాక్ చేస్తే భారీ మొత్తం ఇస్తామని అంటున్నారు. అయితే దీనికి భారత హ్యాకర్లు మాత్రం ససేమిరా అంటూ వాళ్ల ఆఫర్లను తిరస్కరించారు. కాగా భారత్ చేసిన సర్జికల్ దాడులకు గాను పాకిస్థాన్.. హ్యాకర్లు కొందరు భారతీయ సైట్లలో కొన్నింటిని హ్యాక్ చేసి, వాటిలో తమ దేశభక్తి గీతాలను పోస్ట్ చేశారు. దీంతో ఒళ్లు మండిపోయిన భారత హ్యాకర్లు ఏకంగా వారి ప్రభుత్వ సైట్లేవీ అసలు పనిచేయకుండా చేసేశారు. అసలే ప్రపంచానికి సాఫ్ట్‌వేర్లను సప్లై చేస్తోన్న దేశంగా పేరొందిన భారత్ తమ సైట్లనే హ్యాకింగ్ చేస్తే ఊరుకుంటుందా.. పాక్ సరైన సమాధానం చెప్పింది.