దొరికిన శకలాలు ఎంహెచ్370 మలేషియా విమానానివే..
posted on Oct 7, 2016 @ 11:42AM
రెండేళ్ల క్రితం గల్లంతైన మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్370 విమాన శకలాలను ఎట్టకేలకు గుర్తించారు. 2014 మార్చి 8న ఎంహెచ్370 విమానం 239 మంది ప్రయాణికులతో గల్లంతైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈ విమానం కోసం అధికారులు గాలిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికి ఫలితాన్ని సాధించారు. మారిషన్ లో దీనికి సంబంధించిన కొన్ని శకలాలు లభ్యమవ్వగా.. అవి ఎంహెచ్ 370 విమానానివేనా కాదా అన్న సందేహం ఏర్పడింది. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విస్తృత గాలింపు చేపట్టారు. చాలా రోజుల తర్వాత హిందూ మహాసముద్రంలో కొన్ని చోట్ల విమాన శకలాలు లభ్యమయ్యాయి. ఆఖరికి మారిషస్ తీరంలో దొరికిన విమాన రెక్క భాగం ఎంహెచ్370కి చెందినదేనని విచారణ అనంతరం అధికారులు స్పష్టం చేశారు. కాగా కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తుండగా ఈ విమానం కుప్పకూలిపోయింది. విమాన ప్రమాదంలో 200 మందికి పైగా ప్రయాణికులు, విమానసిబ్బంది మృతి చెందారు.