అమరావతి సాక్షిగా నాలుకల మెలికలు !
posted on Oct 14, 2022 @ 12:16PM
మొన్నెపుడో చెప్పిందొకటి ఇపుడు మార్చి ఇదే వినమంటే ఎలాగయ్యా అంటాడు పక్కనున్నవాడితో విలన్. అప్పుడు మన విలన్ ఇపుడు రాటుతేలేడుసార్.. మనం వ్యూహం మార్చాలి, మాటలూ మార్చి ఇతరులను బుట్టలో వేసుకోవాలి.. అపుడే అన్ని దక్కుతాయి.. వినండి. అంటాడు. వెంటనే మాట మార్చి ఫైటింగ్‌కి సిద్ధమవుతాడు. కానీ ఊరివాళ్లంతా తన్ని బయటకు నెట్టేస్తారు. దాదాపు ఇలాంటి సీన్‌కి పరిస్థితులు సిద్ధమవుతున్నాయా అన్నఅనుమానం కలుగుతోంది ఏపీ ప్రభుత్వానికి రాజధాని అంశం లో. ఎందుకంటే అధికారంలోకి రావడానికి ముందు, అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడంలో నాయ కుల నాలుకలు తాటాకుల్లా మారడం ప్రజలు గమనిస్తున్నారు. అమరావతి రాజధాని అనుకుని గూగుల్ మ్యాప్‌వారూ దాన్నే ప్రకటించినా, వైసీపీ సర్కార్ మాత్రం ఇపుడు రైతాంగం మాటనీ కాదని పరిపాలనా సౌలభ్యం కోసం అని బోర్డు పెట్టుకుని విశాఖ, కర్నూలు, గుంటూరు.. అంటూ అదేదో సినిమాలో కమెడి యన్ చెప్పినన్ని ఊళ్లపేర్లు చెబుతూ పోతున్నారు. పెద్దది గనుక విశాఖ ను ఎక్కువ చెబుతున్నారు. ఇపుడు అదే కావాలని గొంతు మార్చి వైసీపీ నాయకులంతా ప్రచారం చేయడం వెనుక జగన్తో వారికి బంధాన్ని అంత త్వరగా వదులుకోదల్చుకొనకపోవడమేనా? కానీ మాట మార్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు పనిచేయవు. ప్రజలు, ఓటరు నాయకుల్లా కాదు.. చాలా తెలివి మీరారు. ఎవరు ఏమిటన్నది ఇపుడు చక్కగా బేరీజు వేసుకోగల్గుతున్నారు. అందుకే నిటారుగ నిలబడి, గట్టిగానే సమాధానాలు చెబు తున్నారు.
శ్రీకృష్ణకమిషన్ నివేదిక ఆధారంగానే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. కానీ ఈ ప్రాంతమంతా ముంపునకు గురయ్యే ప్రాంతం. కృష్ణా నదికి 8 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహానికే ఈ ప్రాంతం చాలా దెబ్బతిన్నది. భవిష్యత్తులో 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి నిలవగలగడం అసాధ్యం. అన్ని విధాలా ఆలో చించే ఒక నిర్ణయం తీసుకుంటామని 2019లో బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతే ఉండాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది, దీన్ని ప్రతిపక్షంగా తాము అంగీకరిస్తున్నామన్నారు. అంతేకాదు తాము అధికారంలోకి వచ్చినా దీనికే కట్టుబడి ఉంటామని, భూదం దాలు చేసేవారే మారుస్తారు గానీ మేము మార్చేదే లేదని ఇదే బొత్స సత్యనారాయణ విపక్ష పార్టీ నేతగా ఎన్నికల ముందు అన్నారు. రాజధాని విషయంలో నిపుణుల కమిటీ నివేదిక అనుసరించే అన్నీ జరుగు తాయని, ఈప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామని, భవనాల నిర్మానం పూర్తి చేస్తామని ఆయన 2019 నవంబర్‌లో అన్నారు. అంతేగాక భూసమీకరణ ఒప్పందం అనుసరించి గత ప్రభుత్వం రైతులకు ఇచ్చి న హామీలను నెరవేరుస్తామని అన్నారు. 2020 జనవరిలో మాత్రం సిఆర్ డిఏ గురించి విరుద్ధంగా మాట్లా డారు. గత ప్రభుత్వం దీనివల్ల ఇతర ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది గనుక సిఆర్‌డిఏ చట్టాన్నే వద్దన్నారు. విశాఖ, కర్నూలు అభివృద్ధిని ఎలా నిరోధిస్తారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని తమ ప్రభుత్వం ఆశిస్తోందని బొత్స అన్నారు. ఆ తర్వాత మూడు రాజధానులు పాలనా సౌలభ్యానికే అన్నది గుర్తించాలని, ఇందులో తప్పు పట్టాల్సింది, తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అంశ మేమీ లేదని రౌండ్‌టేబుల్ సమా వేశంలో గట్టిగా ప్రస్తావించారు. రాష్ట్ర మంత్రిగా బొత్స ఒకే అంశం మీద ఇన్ని రకాల అభిప్రాయాలను వ్యక్తం చేసి రాష్ట్ర ప్రజల్ని ఆశ్చర్యపరిచారు. ప్రభుత్వ ఆలోచన ఎన్ని రకాలుగా మారిస్తే అన్నివిధాలుగా పోపు వేసి ప్రచారం చేయడం, విపక్షాలపై విరుచుకు పడటం ఆనవాయితీగా వస్తోంది. ముందు ప్రకటిం చిన దానికి, చెప్పినదానికి , ప్రభుత్వ ప్రకటనకూ పొంతన లేకుండా ఉండటం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిం దన్నది ప్రజలకు అర్ధమవుతోంది. రాజధాని విషయం ఎంతో కీలకాంశం. దీనిలోనే అనేక వొంకరులు పోవడం విడ్డూరమే. పైగా రియల్ ఎస్టేట్ ఒప్పందంతోనే రైతులు భూములిచ్చారనడం రైతాంగాన్ని అవ మానించడం కాదా అని విశ్లేషకులూ ప్రశ్నించారు.
మరో చిత్రమేమంటే, విపక్షంలో ఉన్నపుడు అమరావతే రాజధానిగా ఉండాలన్నదానికి మద్దతుగా ప్రకట నలు చేసిన ధర్మాన ఆ తర్వాత గుంటూరు రాజధాని రాజధాని చేయడానికి ఎందుకు వీలు కాదని అన్నా రు. అధికారంలోకి రాగానే మాటమార్చడం గమనించాం. 2019లో విశాఖను రాజధాని చేయడానికి అడ్డుకు నేవారిని అస్సలు క్షమించదని ఇదే ధర్మాన విజయనగరం ప్రాంతంలో ఒక బహిరంగసభలో ప్రజల్ని దాదాపు రెచ్చగొట్టే ప్రసంగమే చేశారు.
వైసీపీ మరో నేత అవంతి శ్రీనివాస్ అయితే అమరావతి నుంచి రాజధానిని మార్చాల్సిందేనని, అలాగా కుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి అసాధ్యమన్నది విపక్షాలకు వినిపించేలా అన్నారు. అంటే వైసీపీ అధి నేత మాటకు, అడుగులకు ప్రచారకులుగా మారడం తప్ప మరో ఆలోచనే లేదన్నది వీరి ప్రకటనల్లో డొల్ల తనం తెలియజేస్తుంది.