ఇమ్రాన్ ఖాన్ కు మరో ఊరట
posted on May 12, 2023 @ 1:26PM
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఊరట లభించింది . నిన్న పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్ అరెస్ట్ పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే . న్యాయస్థాన ప్రాంగణంలో ఏకంగా 90 మందికి పైగా భధ్రతా సిబ్బంది జొరబడి అరెస్ట్ చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇవ్వాళ తోషాఖానా కేసులో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు స్టే జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన శుక్రవారం కోర్టుకు హాజరు కాగా.. ఆయనపై చర్యలు తీసుకోకుండా కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులను కూడా ప్రకటించింది. ఇమ్రాన్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేబట్టరాదని ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది.
ఈ కేసులో ఆయన దోషి అన్న ఉత్తర్వులు చెల్లవని కూడా పేర్కొంది. ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది.ఈ కేసులో ఆయన దోషి అన్న ఉత్తర్వులు చెల్లవని కూడా పేర్కొంది. ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది.
ఇస్లామాబాద్ హైకోర్టు బయట ఇమ్రాన్ ను పారామిలిటరీ బలగాలు అరెస్టు చేయడంపై మండిపడుతూనే.. ఆయన మద్దతుదారులు వెంటనే హింసాకాండకు స్వస్తి చెప్పాలని కూడా న్యాయమూర్తులు సూచించారు. తనను పోలీసులు టార్చర్ పెట్టారని, లాఠీలతో కొట్టారని ఇమ్రాన్ కోర్టులో వాపోయారు.
రెండు కోర్టుల నుంచి కూడా తనకు ఊరట లభించడంతో 70 ఏళ్ళ ఇమ్రాన్ ఖాన్.. ఈ మధ్యాహ్నం తన పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. పైగా ముందస్తు బెయిలు కోసం ఆయన ప్రయత్నించవచ్చునని వెల్లడయింది. కోర్టుల నుంచి తమ నేతకు ఉపశమనం లభించడంతో ఆయన మద్దతుదారులు హర్షం ప్రకటిస్తున్నారు.