ఉచితాల పనిపట్టేందుకు కమిటీ.. సీజేఐ
posted on Aug 4, 2022 @ 12:00PM
ఉచితాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజలకు మరింత అలవాటు చేశా రు. పార్టీ ప్రచారానికి, ఎన్నికల సమయంలో జనాన్ని ఆకట్టుకోవడానికి, పాలన అద్భుతంగా చేపట్టడానికి అన్నింటికీ పార్టీలు గాలం వేసేది జానాన్నే. సులభంగా వలలో చిక్కేదీ ఓటర్లే. చిత్రమేమంటే ఆనక పాలనలో వచ్చే చిక్కులన్నింటికీ ప్రజలకు ఉచితాలిచ్చే తెచ్చుకున్నామని ప్రభుత్వాలే అనుకుం టు న్నాయి. అసలు ఉచిత పథకాల పంపిణీ హామీలతో అధికారం సాగించాలనుకోవడాన్ని న్యాయ వేత్తలు తప్పు పడుతున్నారు.
ఉచితపథకాల పంపిణీ హామీలు అన్నది తీవ్ర ఆర్ధిక అంశమని సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఈ హామీల నియంత్రణకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. ఇందులో నీతి ఆయోగ్, ఆర్థికసంఘం, లా కమిషన్, ఆర్‌బీఐతో పాటు పాలక, ప్రతి పక్షా లు, ఇతర భాగస్వాములు కూడా సభ్యులుగా ఉండాలని పేర్కొంది. పార్టీల ఉచిత హామీలను ఏ విధం గా నియంత్రించాలో ఈ కమిటీ నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరింది. ఈ కమిటీ కూర్పుపై కేం ద్రం, ఎన్నికల కమిషన్ (ఈసీ), సీని యర్ న్యాయవాది కపిల్ సిబల్, పిటిషనర్లు తమ తమ అభిప్రాయాలను వారం రోజుల్లో తెలియజేయా లని చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదే శించింది.
ఎన్నికల్లో లబ్ధికోసం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు వివక్షాపూరితంగా హామీలిస్తున్నాయ ని.. హేతుబద్ధత లేని ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయని.. వీటిని కట్టడి చేయాలని కోరుతూ న్యాయ వాది అశ్వినీ ఉపాధ్యాయ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇది తీవ్ర వ్యవహారమని గతవారం విచా రణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
దీనిపై తన వైఖరిని స్పష్టం చేయాలని కేంద్రాన్ని ఆదేశిం చింది. సిబల్ ఎవరి తరఫునా న్యాయవాది కానప్పటికీ ఈ అంశంపై సలహాలివ్వాలని ఆయన్ను కోరింది. ఈ పిటిషన్ బుధవారం మళ్లీ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును ధర్మాసనం ప్రస్తావించింది. అయితే ఈ వ్యవహారంపై పార్లమెంటు చర్చించాలని సిబల్ సూచించారు. దీనికి జస్టిస్ రమణ స్పందిస్తూ ఈ అంశం పై పార్లమెంటులో చర్చ జరుగుతుందని మీరు భావిస్తున్నా రా? ఏ రాజకీయ పార్టీ చర్చిస్తుంది..? ఏ పార్టీ కూడా ఉచితాలను వ్యతిరేకించదు. ఈ రోజుల్లో అందరికీ ఉచితాలు కావాలి. ఫలానా పార్టీ అని పేరు చెప్పను. అన్ని పార్టీలూ వీటి నుంచి లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు.