ఐస్‌క్రీమ్ తిని డబ్బులు అడిగినందుకు చంపేశారు..
posted on Jul 3, 2016 @ 1:54PM
ఐస్‌క్రీమ్ తిని డబ్బులు అడిగినందుకు ఓ వ్యాపారిని కొట్టి చంపారు కొందరు దుర్మార్గులు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మహారాజ్‌పూర్‌లో ఇస్లాం అనే చిరు వ్యాపారి తన భార్య, పాప, బాలుడుతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఐస్ క్రీం అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే కొంతమంది యువకులు ఇస్లాం వద్ద బలవంతంగా ఐస్ క్రీంలను బలవంతంగా లాక్కొని తినేవారు. వాటికి డబ్బులు చెల్లించేవారు కాదు. ఇలా ప్రతి రోజు చేస్తుండటంతో తనకు నష్టం రావడంతో పాటు విసిగిపోయిన ఇస్లాం తిన్న ఐస్‌క్రీంకు డబ్బివ్వాలని కోరాడు. అంతే మమ్మల్నే డబ్బులు అడుగుతావా..? అంటూ వారంతా అతనిపై దాడి చేశారు. ఇస్లాం వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికి..అతని రెండు చేతులూ పట్టుకుని, మరణించే వరకూ కొట్టారు. ఆపై ఇస్లాం మృతదేహాన్ని ఇంటి ముందు తెచ్చి పడేసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు.