ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు..45 మంది మృతి
posted on Jul 3, 2016 @ 1:11PM
ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నైనిటాల్, చంపావత్, అల్మోరా, పౌరీ, హరిద్వార్, డెహ్రాడూన్, ఉత్తరకాశీ, పితోరగఢ్, ఛమోలీ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 10 నదులు వాటి ఉపనదులు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటి వరకు 45 మంది మరణించినట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, ఇండో-టిబెటన్ పోలీస్, సశస్త్ర సీమా బల్, రాష్ట్ర పోలీసులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.