ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలకు ఉగ్రముప్పు.. ఐబీ హెచ్చరిక
posted on Aug 4, 2022 @ 11:23AM
పంద్రాగస్టు వేడుకలు ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. ఆజాదీ కా అమృతోత్సవ్ పేరిట దేశ వ్యాప్తగా ఘనంగా స్వాంతంత్ర్యదినోత్సవ వేడుకలునిర్వహించుకుంటున్న వేళ ఐబీ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తోంది.
పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే ఇ తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలు పంద్రాగస్టు సందర్బంగా ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించిన ఐబీ ఎర్రకోట వద్ద అత్యంత పటిష్ఠ భద్రతా ఏర్పాట్లే చేయాలని సూచించింది.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యతో పాటు ఉదయ్‌పూర్, అమరావతి ఘటనలను కూడా అందులో ప్రస్తావించింది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్‌లోని పెద్ద నేతలు టార్గెట్ గా దాడులు జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. పంద్రాగస్టు లక్ష్యంగా ఉగ్రదాడుల ముప్పు హెచ్చరికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట ఎంట్రీ పాయింట్ వద్ద నిఘా పెంచారు.