డాక్టర్ పై కాల్పులు ఆపై ఆత్మహత్య
posted on Feb 9, 2016 @ 9:31AM
హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో శశికుమార్ అనే డాక్టర్ ఉదయ్ అనే మరో డాక్ట్రర్ పై కాల్పులు జరపిన సంగతి తెలిసిందే. అయితే ఉదయ్ పై కాల్పులు జరిపిన అనంతరం శశికుమార్ మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం ఉదయ్, సాయి, శశికుమార్ అనే ముగ్గురు వైద్యులు మాదాపూర్‌లో స్థాపించిన లారల్ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. అయితే వీరి ముగ్గురికి ఆస్పత్రి ఆర్ధిక లావాదేవీల విషయంలో విబేధాలు రావడంతో శశికుమార్ ఉదయ్ పై కాల్పులు జరిపాడు. ఉదయ్ పై కాల్పులు జరిపిన అనంతరం మొయినాబాద్ నక్కలగుడ్డలో ఉన్న తన ఫాం హౌస్‌లో గన్‌తో రెండు రౌండ్లు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అంతేకాదు శశికుమార్ ఆత్మహత్య చేసుకొన్న ఫాం హౌస్లో సూసైడ్ నోట్ దొరికినట్టు పోలీసులు తెలుపుతున్నారు. తన చావుకు సాయి కుమార్, ఉదయ్ లే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన వద్ద పని చేసిన వారే తనను మోసం చేశారని పేర్కొన్నారు. అంతేకాదు ఉదయ్ పైన తాను కాల్పులు జరపలేదని, మరో డాక్టర్ సాయి కాల్పులు జరిపాడని, నేను భయపడి పారిపోయానని తెలిపాడు.