జయరామ్ కోమటికి తెలుగు ప్రజల ఘనస్వాగతం..
posted on Feb 9, 2016 @ 9:44AM
జయరామ్ కోమటి ఉత్తర అమెరికాలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియమితులైన అనంతరం ఆయన అమెరికా వెళ్లగా అక్కడి తెలుగు ప్రజలు, ఎన్నారై టీడీపీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. బే ఏరియా తెలుగు అసోసియేషన(బాటా), ఎన్నారై టీడీపీ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు చెందిన సుమారు రెండు వందల మంది ఆయనకు ఘనస్వాగతం పలికి పూలమాలలు, పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. అంతేకాదు శానఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుండి 150 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా మాతృ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని.. ఏపీ ప్రభుత్వానికి, ఎన్నారై తెలుగు కమ్యూనిటీకి మధ్య వారధిగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు.