14 ఏళ్ళ ప్రేమ, పెళ్లి.. ఆ తర్వాత ఇలా..
posted on Apr 28, 2021 9:08AM
ఆమె పేరు విజయ. అతని పేరు ఆంజనేయులు. ఇద్దరు ప్రేమించుకున్నారు. 14 ఏళ్ళ కింద పెళ్లి కూడా చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి. రహమత్‌నగర్ సమీపంలోని ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసముంటున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
కట్ చేస్తే.. ఈ నెల 26వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో విజయ తన తల్లి మణెమ్మ కు ఫోన్ చేసింది. పిల్లలు జాగ్రత్త అంటూ చెప్పి ఫోన్ కట్ చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం విజయ ఇంట్లో తలుపులు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న మణెమ్మ తన కుమార్తె మృతికి అల్లుడు, అతని కుటుంబ సభ్యులే కారణమంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ముందు విజయ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓపెన్ చేస్తే.. విజయ రాసిన లేఖ లో ..ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. పెళ్లయిన నాటి నుంచి నా భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నా.. రోజు చిత్రహింసలే.. తీవ్రంగా కొట్టడంతో పాటు ఉద్యోగానికి వెళ్లమని చెప్ఫి. అక్కడున్న ఉద్యోగులతో కలిపి లేని పోని అభాండాలు వేసేవాడు.. చివరికి నన్ను మర్డర్ చేయాలని చూశాడు .. నా భర్తకు వాళ్ల అన్నయ్య చంద్రయ్య అండ ఉంది.. నన్ను చంపేస్తే వాళ్ల అక్క బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానంటూ లేనిపోని మాటలు చెప్పాడు.. నా చావుకి ముఖ్య కారణం అతని సోదరులే.. నేను చనిపోతున్నాను.. నా భర్తను వదిలిపెట్టవద్ధు. నా పిల్లలను మాత్రం మా అమ్మనాన్న, సోదరుల వద్ద ఉంచండి’’ అంటూ విజయ తన లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. వియజ లేఖలో ఇలాంటి నిజాలు బయట పడ్డాయి..లేఖ చదివిన పోలీసులు విజయ భర్త ఆంజనేయులును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.