ప్రేమకోసం.. అన్నను చంపిన నటి..
posted on Apr 28, 2021 7:52AM
ప్రేమ కోసం ప్రేమించిన వాళ్ళు చనిపోవడం చూశాం. లేదా అదే ప్రేమని మర్చిపోయి వేరే జీవితం స్టార్ట్ చేసేవాళ్లను చూశాం.. కానీ ప్రేమ సొంత అన్ననే చంపింది ఓ యువతి.. ఆ యువతీ ఎవరో కాదు. తను ఓ సినిమా నటి.
ఆమె పేరు షనయ. ఆమె కొంతకాలంగా నియాజ హమీద్ కటిగర్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఇద్దరు కొంత కాలంగా చెట్టపట్టాలు వేసుకుని సినిమాలు, షికార్లు అంటూ తిరిగారు.. ప్రేమలో పీకలలోతు మునిగారు. ఒక్కసారిగా కరోనా వల్ల ప్రపంచానికి బ్రేక్ పడినట్లు. షనయ ప్రేమ విషయం సోదరుడు రాకేశ్ కాట్వే తెలియడంతో వారి ప్రేమకు బ్రేక్ పడింది.
ఇక అంతే షనయ తన సోదరుడికి భూమి మీద నూకలు చెల్లాయి. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడన్న కారణంతో రాకేశ్ కాట్వే మర్డర్ కి పధకం సినిమా తార. తన ప్రియుడి సాయంతో హత్యకు రంగం సిద్ధం చేసింది. అందుకోసం మరో ముగ్గురి సాయం తీసుకుంది.
ప్రణాళిక ప్రకారం.. హుబ్బల్లిలోని తన ఇంట్లోనే రాకేశ్ గొంతు కోసి హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు దేవరా గుడిహల్ అటవీ ప్రాంతంలో రాకేశ్ తల, మిగిలిన శరీరభాగాలు వేర్వేరు ప్రాంతాల్లో గుర్తించారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే నియాజహమీద్ కటిగర్ (21), తౌసిఫ్ చన్నాపూర్ (21), అల్తాఫ్ ముల్లా (24), అమన్ గిరానివాలే (19)లను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా షనయను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. షనయ 2018లో కన్నడ చిత్రం ‘ఇదం ప్రేమం జీవనం’లో తొలిసారి నటించింది. ఇటీవలే ఒక అడల్ట్ కామెడీ చిత్రంలోనూ నటించింది. కన్నడ చిత్రసీమలో ఇప్పుడీ ఘటన చర్చనీయాంశంగా మారింది.