తల్లి ప్రియుడికి.. కూతురు బలి..
posted on May 3, 2021 @ 2:56PM
ఆమెకు పెళ్లి అయింది. అయినా పాడుబుద్ది ఒక్క చోట ఉండనియ్యదు అన్నట్లు.. ఆమె పక్కింట్లో ఉన్న వ్యక్తి తో సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తి రోజు ఇంటికి వాస్తు ఉండేవాడు. ఇదే క్రమంలో తరుచూ ఇంటికొచ్చే ఆ దుండగుడి కన్ను.. తన ప్రియురాలి కూతురు మీద పడింది. ఇక అంటే ఆ ప్రబుద్దుడు ఆ బాలికను లైన్ లో దించడానికి పధకం పన్నాడు. తరుచు లైంగికంగా వేధించాడు. ఆ విషయం గురించి ఆ కూతురు తన కసాయి తల్లికి చెప్పింది. కానీ ఆ తల్లి మాత్రం ఆ నీచుడికి సహకరించాలని సూచించింది. అదేంటి అనుకుంటున్నారా.. ఏం చేస్తాం ఆ తల్లి అలా దిగజారింది మరి. తన ప్రియుడు ఎక్కడ దూరం అవుతాడోనాని, బయపడినట్లుంది. కని, కళ్ళ ముందు పెంచి.. అలారుముద్దుగా పెంచించిన కూతురును ఎవరైనా పల్లెత్తు మాట అంటేనే తట్టుకోలేరు తల్లులు. మరి ఆ కసాయి తల్లి మాత్రం కూతురు బతుకులో నిప్పులు పోయడానికి రెడీ అయింది. నిత్యం అదే సంఘర్షణ.
కట్ చేస్తే.. ఆ తల్లి పట్టించుకోలేదు. ఆయినా చూసీ చూడనట్టు ఉండాలని.. ఇవన్నీ పట్టించుకోవద్దని.. సర్దుకుపోవాలని చెప్పిందా తల్లి. అలా చేసి చివరికి తల్లీ కూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చిపెట్టింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ కూతురును లైంగికంగా వేధింపులకు గురి చేసి.. ఆమెకు గర్భం వచ్చేలా చేసింది.
ఇదే అదునుగా తీసుకున్న ఆ నిందితుడు ఆ మైనర్ ను పూర్తిగా తన మాయ మాటలతో లైంగికంగా లొంగదీసుకున్నాడు. ఇదే క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆ బాలిక గర్భవతి అని తేలింది. దీంతో ఆమె తల్లి.. ఆ కూతురును తన సోదరుల ఇంట్లో ఉంచింది. వారికి కూడా ఆమె గర్భవతి అన్న విషయం చెప్పలేదు. కొద్దిరోజుల పాటు ఆ కూతురు.. తల్లిని కలవడానికి ప్రయత్నించినా.. అందుకు ఆమె అంగీకరించలేదు. ఇక లాభం లేదనుకున్న ఆమె.. ఈ విషయాన్ని తన మామలతో చెప్పింది. ఆ అమ్మాయి మేన మామ.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ఆమెను బాలల సంరక్షణ గృహానికి పంపారు. ఆమె తల్లి, బాలికను గర్భవతిని చేసిన ఆ దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. వారిని కటకటాల వెనక్కి పంపారు.