ఏపీలో ఎల్లుండి నుండి ఆంక్షలు..
posted on May 3, 2021 @ 2:28PM
కరోనా తో సంవత్సరం నుండి ఫైట్ చేస్తున్నారు ప్రజలు. కరోనా మొదటి వేవ్ ప్రపంచంతో పాటు మన దేశం కూడా ఇరుకున పడేసింది. కొంత కాలం తర్వాత కొంత ఉపశమనం ఇచ్చింది అనుకునే లోపు. మళ్ళీ సెకండ్ వేవ్ విరుచుకుపడింది. కరోనా మరణాలతో దేశం మొత్తం అట్టుడుకుతోంది.. నిత్యం ప్రజలు కరోనా భారీన పడి పిట్టలా రాలిపోతున్నారు. ఒక వైపు నిరుపేదలకు కరోనా వస్తే.. హాస్పిటల్ లో ఫీజులు కట్టలేక చివరికి వారికి స్మశానమే హాస్పిటల్ బెడ్లు అవుతున్నాయి. వారి శవాలకు స్మశానాలు స్వాగతం పలుకుతున్నాయి. ఒక వైపు ఆక్సిజన్ అందక మరో వైపు వ్యాక్సిన్ అందరికి అందుబాటులో లేక శవాలతో స్మశానాలు కలకళలాడుతున్నాయి.
కరోనా అంతకంతకూ పెరుగుతుండటంపై కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఉ.6 నుంచి మ.12 వరకే దుకాణాలకు అనుమతిచ్చారు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. కొవిడ్ నియంత్రణపై సీఎం జగన్ మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వివరించారు. కొవిడ్ నివారణ చర్యలతో పాటు ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు ఆయన వివరించారు. నిర్ణీత సమయాల్లో కర్ఫ్యూ విధించాలని సూచించారన్నారు.