ప్రియురాలి మృతి... ఆవేదనతో పెట్రోల్ పోసుకొని ప్రియుడు సూసైడ్
posted on Jan 7, 2026 @ 3:27PM
హయత్‌నగర్, యాచారం ప్రాంతాల్లో వరుసగా చోటుచే సుకున్న ఆత్మహత్యలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ప్రియురాలి మరణాన్ని తట్టు కోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హృదయ విదారక సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జరిగింది. యాచారం మండలంలో నివాసం ఉంటున్న పూజ (17) అనే బాలిక నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే పూజ మరణించినట్లుగా వైద్యులు దృవీకరించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ప్రేమ జంట సిద్ధగోని మహేష్ (20), పూజ(16) గత నాలుగు నెలలుగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇటీవలే ఈ ప్రేమ జంట మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం రోజు ప్రియుడు మహేష్ బాలిక పూజకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో తీవ్ర మన స్థాపానికి గురైన పూజ మంగళవారం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. పూజ మృతికి కారణం ఆమె ప్రేమ వ్యవహారమేనని బంధువులు ఆరోపిస్తు న్నారు. పూజ, సిద్ధగోని మహేష్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబ సభ్యులకు తెలుసు... పూజ కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు.
అయితే పూజ ఆత్మహత్యకు బాధ్యుడిగా మహేష్‌ను పేర్కొంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మహేష్‌ను విచారణకు పిలిచారు.పూజ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే మహేష్ తీవ్ర మనస్తాపానికి గురై నాడు. పూజ మరణాన్ని తట్టుకోలేక తీవ్ర ఆవేదనకు లోనైన మహేష్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటిం చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేశారు. కానీ అప్పటికే మహేష్ మృతి చెందాడు..మహేష్, పూజ ఇద్దరూ గతంలో కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అప్పట్లో కుటుంబ సభ్యులు, పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను సర్దుబాటు చేసినట్లు సమాచారం. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు ఈ విషా దాంతానికి దారి తీశాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రేమికులు మరణించడంతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి..ఈ రెండు ఘటనలపై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యలకు దారితీసిన కారణాలు, కుటుంబ పరిస్థితులు, ప్రేమ వ్యవహారంలోని అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.