అక్బరుద్దీన్‌ కు తెలంగాణ సెగ..హరీష్ ఫైర్

 

 

 

తెలంగాణ బంద్ నేపథ్యంలో జిల్లాలోని కొత్తూరు మండలం జేపీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు.


తెలంగాణ కోసమే తమ పోరాటం కానీ...రాయల తెలంగాణ కోసం కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ తెరపైకి తెస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ గద్దెలను కూల్చేస్తామని హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా హరీష్‌రావు సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల తెలంగాణను ఒప్పుకోమన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ నాయకులు ఎన్నో కుట్రలు చేశారని, వారితో తాము కలిసేది లేదని హరీష్‌రావు తేల్చిచెప్పారు.