సమాజ్ వాదీ పార్టీకి ఇక కఠిన పరీక్షనే?
posted on Oct 11, 2022 @ 12:07PM
దేశ రాజకీయ కుటుంబాల్లో పెద్దదిగా పేర్కొనే కుటుంబ పెద్ద ములాయం సింగ్ యాదవ్. పైకి ఎంతో స్నేహపూర్వకంగా కనిపిస్తూనే కఠిన నిర్ణయాలతో ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకత్వం ఆయన ది. 36 సంవత్సరాలు పాటు విక్రమాదిత్యమార్గ్‌లో వైట్ హౌస్ అని పార్టీ అభిమానులు పిలిచే విశాలమైన భవంతిలో ఆయన నిత్యం పార్టీ వారితో సమావేశమవుతూండేవారు. లోపల రామ్‌సేవక్ యాదవ్, లోహి యా, మధు లిమాయే, చంద్రశేఖర్, జయప్రకాష్ నారాయణ్, రాజ్‌నారాయణ్, జానేశ్వర్ మిశ్రా వంటి హేమాహేమీల ఫోటోలే కనపడతాయి. ఈ వరుసలో అంతటి స్థాయిలో దేశంలో మన్ననలు అందు కున్న నాయకుడు ములాయం. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి తిరుగులేని చరిత్రను సృష్టించడంలో ములాయంసింగ్ యాదవ్ రాజకీయరంగంలో పార్టీలకు అతీతంగా అందరి ఆదరాభిమానాలు పొందారు. ములాయం మరణంతో అఖిలేష్ తన తండ్రిని, ఎస్పీ దాని నాయకు డిని కోల్పోయారు. ఇక సవాళ్లను ధాటిగా ఎదుర్కొ నేందుకు మరింత సిద్ధపడాలి.
1982లో ఫైర్‌బ్రాండ్ రాజకీయనాయకునిగా తెరమీదకి వచ్చి ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో తన ప్రత్యేక ముద్ర వేశారు. 2018లో మాజీ ముఖ్యమంత్రులు తమ అధకార నివాసాలు వదిలేయాలని తీర్పు ఇవ్వ డంతో ములాయం విక్రమాదిత్యమార్గ్ కు దూరమయ్యారు. అప్పటి నుంచి ఆ బంగ్లా ఖాళీగానే ఉంది. ఇక్కడి నుంచే 1989లో అజిత్ సింగ్‌కు వ్యతిరేకంగా రాజకీయ యుద్ధం చేశారు. అప్పట్లో ప్రధాని వీ.పీ.సింగ్ అజిత్ కు ఎంతో మద్దతునిచ్చారు. 1990లో పోలీసులు కరసేవకులపై దాడులు చేయడం జరిగింది. ఆ సంఘట న తో ఆయన మౌనం వహించారు. 1992 అక్టోబర్ 4న ములాయం ఇక్కడి నుంచే సమాజ్ వాదీపార్టీ ఆరం భించారు. మరు సంవత్సరమే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ పర్యాయం తన పార్టీ తరఫునే బహుజన్ సమాజ్ పార్టీ (బీ ఎస్‌పి) మద్దతుతో పీఠం అధి ష్టించారు. 1995లో రెండు పార్టీలు వీడి పోయి తీవ్రస్థాయిలో విభేదించుకున్నా, ములాయం మాత్రం అధి కారంలో ఉండగలిగారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను తన చుట్టూ రెండు దశా బ్దాలు తిరిగేట్టు చేయ గలిగారు.
అలాగే, 1996లో లోక్‌సభకు మొదటిసారిగా ఎన్నికయిన వెంటనే కేంద్రంలో రక్షణ మంత్రి గానూ పదవి చేపట్టడంతో ఎస్ పి పార్టీ ప్రాంతీయత నుంచీ జాతీయ స్థాయిలో కీలకపాత్ర వహించే స్థాయికి గుర్తింపు తెచ్చుకుంది. 2012లో యుపి అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ గెలిచినప్పటికీ ములాయం మాత్రం తమ్ముడు శివపాల్ యాదవ్ అడ్డుకుంటాడని తెలిసినా, తన కుమారుడు అఖిలేష్ కు రాజకీయ వారస త్వాన్ని అం దించారు ములాయం. వాస్తవానికి తన కుమారుడికి అధికారం పూర్తిగా అందించే వరకూ తమ్ముడి రాజకీయ ఎత్తుగడలనుంచీ కాపాడుతూ వచ్చారు. క్రమేపీ కుటుంబంలో శివపాల్, అఖిలేష్ విభేదాలతో కు టుంబం రాజకీయ పటం మీద సత్తువ తగ్గింది. దీంతో మోదీ సారధ్యంలో బీజేపీ యుపీలో విజృంభించింది. ఫలితంగా రాష్ట్రంలో ఎస్.పీ పార్టీ రెండు పర్యాయాలు భారీ ఓట్ల తేడాతో ఓడి పోయింది. ఇక ఇపు డు పార్టీ మరింత సమస్యను ఎదుర్కొనే అవకాశమూ ఉంది.
ఇన్నాళ్లూ ఉత్తరప్రదేశ్‌లో జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన సమాజ్ వాదీ పార్టీ ములాయంసింగ్ (82) మరణంతో సమస్యల్ని ఎదర్కొన వలసిన పరిస్థితుల్లో నిలిచింది. 2013లో ఒకసారి అఖిలేష్ తన రాజకీయ ఎదుగుదల గురించి మాట్లాడు తూ, గురువును వెనుక నుంచి గమనిస్తూనే ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అన్నారు. ములాయం సింగ్ తో తండ్రిగా, రాజకీయ గురువుగారూ అఖిలేష్ గొప్ప అనుబంధంతో ఉన్నారు. కానీ తన కుమారుడు రాజకీయాల్లో తలమునకలై ఉండడంతో ఎక్కువ సమయం గడపలేక పోయానని ములాయం కూడా అన్నారు. రెండోతరం నాయకుడయిన అఖిలేష్‌కీ రాజకీయాలు అంత సులువుగా సాగిపోయేంతటివి కావు. తన రాజకీయజీవితం అంతా రోలర్ కోస్టర్ వంటిదని ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటున్నానని, తొలినాళ్లలో రాష్ట్రంలో ఉన్నతవర్గాల ఆధిపత్యంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, తాను వెనుకబడిన తరగతు లకు చెందినవాడిని కనుక రాజకీయంగా ఎన్నడూ మద్దతు లేదని 1990ల్లో ఒకసారి ములాయం మీడియా తో మాట్లాడుతూ అన్నారు. అయితే 2012లో తన కుమారుడు అఖిలేష్‌కు తన రాజకీయవారసత్వాన్ని అందజేస్తూ, ముఖ్యమంత్రి తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానని అన్నారు.
ఇక ఇప్పుడు పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొనవలసి వస్తుంది. ములాయం మృతితో రాష్ట్రంలో మారు మూ ల గ్రామాలకు పార్టీతో ఉన్నసంబంధాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. ములాయం, ఆయన పార్టీని ఇప్పటివరకూ బీజేపీ ఆగడాలను ఎదుర్కొనగలిగిన గట్టి శక్తిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రజాదరణను సృష్టించేందుకు కుల ఆధారిత వ్యాప్తితో మతపరమైన సమీకరణ ను కలిపిన బిజెపి బలీయమైన రాజకీయ యంత్రాంగా నికి పార్టీ వ్యతిరేకంగా ఉంది. అంతే కాకుండా, పార్టీ కొన్ని వర్గాల కోసం మాత్రమే పనిచేస్తుందనే భావనను తొలగిం చడానికి పోరాడుతోంది, పోషకాహార నెట్ వర్క్ లపై దృష్టి పెడుతుంది. అందరికీ అభివృద్ధిని చేర్చడానికి దాని పాత తరహా కుల రాజకీయాలను తిరిగి ఊహించలేము.
లక్నో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మనోజ్ దీక్షిత్ ఇలా అన్నారు.. ఎస్పీ తన బ్రాండ్ ములాయం ను కోల్పోవడంతో బాధ తప్పదు. పార్టీలోని ప్రతి అంగుళాన్ని ఆయనే నిర్మించారు. ఇప్పుడు, విధే యు లు, కుటుంబంతో సహా చాలా మంది విడిపోతారు. కానీ అప్పుడు, పార్టీ కొత్త రూపు దాలుస్తుంది, అఖి లేష్ తర్వాత 21వ శతాబ్దపు పార్టీ దాని పూర్తి నియంత్రణను పొందుతుందని ఆయన అన్నారు. ములాయం మరణంతో అఖిలేష్ తన తండ్రిని, ఎస్పీ దాని నాయకు డిని కోల్పోయారు.
ఇక సవాళ్లను ధాటిగా ఎదుర్కొ నేందుకు మరింత సిద్ధపడాలి. మరీ ముఖ్యంగా ఎస్‌పి కి చాలాకాలం నుంచీ పెట్టని కోటగా ఉన్న మణి పూర్, కనోజ్, సంబల్ వంటి నియోజక వర్గాల్లో పార్టీ పట్టు తప్పిపోకుండా కాపాడుకోవా ల్సిన బరువు బాధ్య త అఖిలేష్ ఏ మేరకు స్వీకరిస్తారని, విపక్షాలు, ప్రత్యర్ధుల నుంచి సవాళ్లను ఏమేరకు ఎదుర్కొనగల్గు తారన్నది చూడాలి.