ఉమ్రాన్, చాహర్ పనికిరాలేదా?.. సెలక్టర్లను ప్రశ్నించిన హర్భజన్
posted on Sep 8, 2022 @ 11:46AM
ఆసియాకప్‌లో పాకిస్తాన్, శ్రీలంక చేతిలోనూ భారత్ ఓటమి పట్ల మాజీ క్రికెటర్లు, వీరాభిమానులు మండి పడుతున్నారు. అసలు సెలక్షన్ విషయంలోనే పొరపాట్లు చేశారని మాజీ స్టార్ హర్బజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ ముందు బ్యాట్చేసిన భారత్ పెద్దగా స్కోర్ చేయకపోగా ప్రత్యర్ధు లను నిలువరించడంలో ఘోరంగా విఫలమయిందని హర్భజన్ ఆరోపణలు గుప్పించాడు. ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్‌లను వినియోగించకపోవడం మీద టీమ్ ఇండియా కెప్టెన్ శర్మను, సెలక్షన్ కమటీని మాజీ స్పిన్నర్ ప్రశ్నించాడు. పాక్‌తో తలపడిన మ్యార్‌లో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేశారు. మంచి స్కోర్ అనుకున్నా, ఆ తర్వాత పాక్‌ను నిలువరించడంలో బౌలర్లు విఫలం కావడమే ఆశ్చర్యపరిచందని అన్నాడు. ఆ మ్యాచ్‌లో మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ నవాజ్‌లు అద్భుతంగా ఆడారు. అంతకంటే మన బౌలర్లు వారిని నిలువరించడంలో చేతులెత్తేశారన్నాడు. మంచి బౌలర్లు అందుబాటులో ఉన్నప్పటికీ వారిని సమయానికి జట్టులోకి తీసుకోకుండా ఉన్నవాళ్లతో సర్దుకుపోయే ప్రయత్నాలే జరిగాయని ఆరోపించాడు. అసలు ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్‌ను పనికి రారని ఎలా భావించారో అర్ధంకావడం లేదని మండి పడ్డా డు హర్భజన్ సింగ్.
శ్రీలంకతో మ్యాచ్ విషయానికి వస్తే, కెప్టెన్ శర్మ అద్భుతంగా ఆడి 41 బంతుల్లో 72 పరుగులు చేయడం ఆశలు కల్పించిందని కానీ ఆ తర్వాత ఏ బ్యాటర్ అతనికి మద్దతుగా నిలవలేకపోవడం దారుణ మన్నాడు. కింగ్ కోహ్లీ, సూర్య, పాండ్యాల మీద పెట్టుకున్న ఆశలు దెబ్బతిన్నాయన్నాడు. మరో వంక కుశాల్ మెండిస్, నిస్సంక ఇద్దరూ 97 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ఆ జట్టును విజయానికి గట్టిమార్గం వేసింది. వారిని అరికట్టడానికి భారత్ బౌలర్లు గట్టిగా వారి ప్రత్యేకతలు ప్రదర్శిం చలేదనే హర్భజన్ విమర్శించాడు. కాయితంమీద కనిపించిన అద్భుతం ఫీల్డ్‌లో లోపించడమే మన సును గాయపరిచిందన్నాడు. రెండు మ్యాచ్‌ల్లో చేతులుఎత్తేయడంతో కప్ ఫైనల్ ఆశలు దెబ్బ తిన్నా యని, దీన్ని గురించి సెలక్షన్ కమిటీ ప్రత్యేకంగా ఆలోచించాలన్నాడు.
హర్భజన్ సింగ్ ఒక్కడేకాదు, పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా భారత్ పరాజయం పట్ల ఆశ్చ ర్యం వ్యక్తం చేశాడు. భారత్ అనుసరించిన గేమ్ ప్లాన్ ఘోరంగా విఫలం కావడం ఇప్పుడే చూశా నన్నాడు. పాకిస్తాన్‌తో ఓడినప్పటికీ ఆ మేరకు శ్రీలంక మీద గెలిచి పాక్ జట్టుకు సవాలు విసరు తుందని ఆశించాన ని కానీ రెండో మ్యాచ్ పరాజయం అస్సలు ఊహించలేదన్నాడు. మ్యాచ్ ఆడే ఫైనల్ లెవెన్ ఎంపిక విష యంలోనే భారత్ సెలక్టర్లు పొరపాటు చేసినట్టుగా కనపడుతోందని అక్తర్ అనుమానం వ్యక్తం చేశాడు. జట్టుకు దినేష్ కార్తీక్, ఆవేష్‌ఖాన్, బిష్ణోయ్, రిషబ్ పంత్, హుడా లలో జట్టుకు ఎవరు ఎప్పుడు ఎంతగా ఉపయోగపడతారన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే పరాభవాలకు అవకాశం ఉండేది కాదని అక్తర్ అభిప్రాయపడ్డాడు.