Read more!

కొత్త సంవత్సరం కొత్త గోల్స్ లో వీటిని తప్పక చేర్చండి!!

కొత్త సంవత్సరం అనగానే చాలామంది కొన్ని గోల్డ్ పెట్టుకుంటారు. అన్ని లిస్ట్ కూడా రాసేసుకుంటారు. కానీ అవన్నీ న్యూ ఇయర్ రోజు అందరికీ శుభాకంక్షాలు తెలుపుతూ, పార్టీలు చేసుకుంటూ ఆ సందడిలో మొదటి రోజే లక్ష్యాలకు పంగనామాలు పెడతారు. అయితే… కొత్త సంవత్సరం సందర్భంగా ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా అవన్నీ పాటిస్తేనే తగిన పలితం ఉంటుంది. లిస్ట్ లో రాసుకున్నంత సులువుగానే వాటిని కూడా అటక ఎక్కిస్తారు. కానీ… కొత్త సంవత్సరం గోల్డ్ లిస్ట్ లో ఎన్ని రసుకున్నా… వాటిలో ఎన్ని ఫాలో అయినా… అవ్వకపోయినా… ప్రస్తుతం మీరు చదవబోయే వాటికి మాత్రం తప్పకుండా చోటు కల్పించి వాటిని ఫాలో అయితే.. కొత్త ఏడాదిలో మీ జీవితంలోంచాలా గొప్ప మార్పు చూస్తారు. అవి ఏమిటంటే…


కొత్త స్నేహం..


స్నేహితులు ఇప్పటికే చాలామంది ఉన్నారు. మళ్లీ కొత్త కొత్త స్నేహం ఏంటి?? అని అనుమానం, కొత్త స్నేహాలు ఎందుకు?? అనే ప్రశ్న చాలామందిలో పుడుతుంది. అయితే స్నేహితులు ఇంతమందే ఉండాలి.. కొత్తగా ఎవరితోనూ స్నేహం చేయకూడదు అనే రూల్స్ ఏమీ జీవితాల్లో లేవు కదా… కొత్త స్నేహం మొదలుపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? అనే ప్రశ్న ఆ తరువాత పుట్టచ్చు… స్నేహాలు పెరగడం వల్ల ఎప్పుడూ వ్యక్తికి ఇతరులతో సంబంధాలు విస్తృతం అవుతాయి. ఈ కారణంగా సర్కిల్ పెరుగుతుంది. దీనివల్ల మనకు ఉన్న ఆత్మీయులు ఎక్కువ అవుతారు. మనిషి సంఘజీవి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. పదిమందితో సత్సంబంధాలు కలిగి, పందిమందితో సంతోషంగా జీవించేవాడికి సమస్యల వల్ల కలిగే ఇబ్బందులు చిన్నవిగా అనిపిస్తాయి. కాబట్టి కొత్త స్నేహం మొదలుపెట్టండి.. 


ఆరోగ్యమే మహాభాగ్యం..


ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఎన్నో సాధించగలుగుతారు. నిజానికి ఆరోగ్యం సరిగా లేకపోయినా అన్ని ఇబ్బందులనూ ఎదుర్కొంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. మన చుట్టూనే అలాంటి వారు మనకు ప్రేరణ కలిగిస్తూ ఉంటారు. అయితే ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యకరంగా జీవించడం ఎంతో ముఖ్యం. అదే మనకు శ్రీరామ రక్ష.


బరువుకు బ్రేక్స్…


కొందరు అధికబరువు ఉంటారు. నిజానికి దీనివల్ల శరీరాన్ని చుట్టుముట్టే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ చేయాల్సిన మొదటిపని శరీరానికి తగిన బరువు ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడం. ఒకవేళ తగిన బరువుకంటే ఎక్కువ ఉంటే బరువు తగ్గడం మీద దృష్టి పెట్టడం.


బ్యాడ్ హబిట్స్ కు బై బై..


చెడు అలవాట్లు అనగానే చాలామంది ఏవేవో ఉహించుకుంటారు. తినకూడని పదార్థం తినడం, సమయవేళలు పాటించకపోవడం, అతిగా తినడం, సంబందం లేకపోయినా ఇతరులతో గొడవ పడటం, నోటి దురుసు, ఇతరులను నొప్పించేలా మాట్లాడటం ఇలా చూసుకుంటే చాలా చిన్న విషయాలలో కూడా తప్పుగా ప్రవర్తించేవారు ఉంటారు. ఇలాంటి వాటిని సురిచేసుకుని చూస్తే తమ జీవితం ఎంత మారుతుందో వారికే స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది.


ఆహార మంత్రం!!


చలి వనికిస్తుంది, మళ్ళీ కోవిడ్ వేవ్స్ వినబడుతున్నాయి. మరి సాదారణంగా సరిపోతుందా?? లేదు కదా.. పోషకాహారం తీసుకోవాలి. తాజాగా ఉండేలా చూసుకోవాలి. రుచి గురించి కాదు, ఆహార నాణ్యత గురించి, అది శరీరానికి చేసే మేలు గురించి ఆలోచించి ఆహారం విషయంలో అడుగులు వెయ్యాలి. 


ఇలా పైన చెప్పుకున్న విషయాలను  మీ న్యూ ఇయర్ లిస్ట్ లో చేరిస్తే.. జీవితాన్ని ఎంతగానో మార్పుకు లోను చేసి సంతోషంగా ఉండటానికి కారణం అవుతుంది. 


                                       ◆నిశ్శబ్ద.