ఇద్దరు సీఎంలపై గవర్నర్ చమత్కారం..
posted on Aug 16, 2016 @ 2:38PM
చాలా రోజుల తరువాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన సందర్భంగా ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ వీరిపై జోకులు పేల్చారు. నిన్న స్వాతంత్ర్య వేడుకల కార్యక్రమంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ప్రసంగించిన గవర్నర్ ఇద్దరు చంద్రులు ఎట్ హోంకు రావడం సంతోషంగా ఉందని.. ఈ రోజు ఫుల్ మూన్ డే అని చమత్కరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధిలో పోటీ పడుతున్నారని.. రాజకీయపరంగా, పరిపాలనలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాగే కలిసి ఉండాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులతో జగన్ కరచాలనం చేసి అందరితో కలిసి విందులో పాల్గొన్నారు.