రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం.. బాబు ట్వీట్
posted on Jul 8, 2023 @ 11:43AM
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? రోజుకో ఘోరం, పూటకో దారుణం జరుగుతోంది. వాటి వెనుక అధికార పార్టీ లేదా ప్రభుత్వం ఉంటోంది. అంటే రాష్ట్రంలో ప్రభుత్వమే టెర్రర్ సృష్టిస్తోంది. రోడ్డు కావాలని అడిగిన కానిస్టుబుల్ సస్పెండ్ అవుతాడు. పెన్షన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన మహిళపై కేసు పెడతారు. బకాయిలు చెల్లించమని అడిగిన వ్యాపారులపై వైసీపీ మూకలు దాడులు చేస్తారు. ఈ పరిస్థితుల్లో జనం ఏం చేయాలి? ఏం కావలి. రాష్ట్రం నుంచి పారిపోతేనే బెటర్ అనుకునే పరిస్థితులలోకి జనాన్ని నెట్టేసింది
జగన్ సైకో పాలనకు చరమగీతం పాడాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పురనరుద్ధరణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలి. ఇదీ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాదులు, సామాన్య ప్రజానీకం ముక్త కంఠంతో చెబుతున్న మాట. అవే మాటలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. బకాయిలు చెల్లించాలని కోరినందుకు ధర్మవరానికి చెందిన చేనేత వర్గ వస్త్ర వ్యాపారులపై విజయవాడలో వైసీపీ గూండాలు అమానుష దాడికి పాల్పడి..బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారు. రోడ్డు వేయమని ఉపముఖ్యమంత్రిని అడిగిన పాపానికి చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి కేసు పెట్టారు. సస్పెండ్ చేశారు. అంతా నా ఇష్టం అడిగేదెవడురా అన్నట్లుగా రాష్ట్రంలో జగన్ పాలన సాగుతోందని చంద్రబాబు ఆ ట్వీట్ లో మండిపడ్డారు.
అయితే ఈ జగన్ అరాచక పాలన మరెంతో కాలం సాగదనీ, శిశుపాలుడి వంద తప్పులులా జగన్ పాపాలు కూడా పండాయనీ, వచ్చే ఎన్నికలలో జనం గట్టి గుణపాఠం చెప్పడం తథ్యమనీ చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య కేసులో స్వయంగా జగన్ సంబధీకులే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, అవినాష్ రెడ్డిని కాపాడేందుకు స్వయంగా సీఎం తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కేసులో సహా నిదితునిగా ఉన్న ఆయనకు ఈ నేరంతో ఆయనకు సంబంధమ వుందా, లేదా? అసలు, కేసేమిటి. ఎక్కడ మొదలైంది ఎన్ని మలుపులు తిరిగింది? వంటి వాటినన్నిటినీ పక్కన పెడితే అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా, లేదా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇందుకు వైసీపీ గూండాలే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో ఎక్కడ ఏ దారుణం జరగినా, దళితులపై మహిళలపై అఘాయిత్యాలు జరిగినా వాటి వెనుక ఉంటున్నది మాత్రం వైసీపీ వారేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ టెర్రరిజానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. వీటన్నిటినీ ప్రస్తావిస్తూ చంద్రబాబు తాజాగా చేసిన ట్వీట్ లో రాష్ట్రంలో జగన్ పాలనను అంతమొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.