స్పీడ్ న్యూస్ 1
posted on Jul 8, 2023 @ 12:23PM
1.టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అల్లూరులో లోకేశ్ కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
2.ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీయేతర రాష్ట్రాలలో సుడిగాలి పర్యటన చేపట్టారు. శుక్రవారం ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్ లలో పర్యటించిన ప్రధాని.. శనివారం ఉదయం తెలంగాణలోని వరంగల్ కు చేరుకున్నారు. ప్రముఖ భధ్రకాళీ దేవాలయంలో ప్రధాని ప్రార్థనలు చేశారు.
3.రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన రోజు నుంచి సినిమా మాటల రచయిత మనోజ్ ముంతాషీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
4.స్టార్ కపుల్ నయన తార - విఘ్నేశ్ శివన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆస్తి వివాదానికి సంబంధించి పోలీసులను ఆశ్రయించిన విఘ్నేశ్ శివన్ స్వంత బాబాయిలు నయనతార పేరును కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
7.టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకునే లక్ష్మిపై కొందరు మహిళలు తాజాగా దాడి చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో అయిదుగురు మహిళలు ఒక్కసారిగా వచ్చి ఆమెపై దాడికి దిగారు.
8.సామాన్యుల కష్టాలను తెలుసుకునేందుకు జనంలోకి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి రైతులను కలుసుకున్నారు. పొలంలో పనిచేస్తున్న రైతులు, రైతు కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు.
9.పంచాయతీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్‌లో మరోమారు హింస చెలరేగింది. నలుగురు టీఎంసీ కార్యకర్తలు నిన్న దారుణ హత్యకు గురయ్యారు.
10.దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద షర్మిల, విజయమ్మ నివాళులర్పించారు. వీరితో పాటు షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి కూడా శ్రద్ధాంజలి ఘటించారు.