రాయల తెలంగాణను వ్యతిరేకించిన ఆజాద్
posted on Dec 5, 2013 @ 12:58PM
పది జిల్లాల తెలంగాణకే కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం ఆయన జీఓఎం సభ్యులకు కూడా సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో చర్చ జరిగి అందరూ అంగీకరిస్తేనే రాయల తెలంగాణ ప్రతిపాదనకు మొగ్గు చూపవచ్చునని, లేకుంటే కొత్త సమస్యలకు దారి తీసినట్లవుతుందని వివరించారట. సిడబ్ల్యుసి నిర్ణయానికి కట్టుబడాలని సూచించినట్లుగా సమాచారం.
రాయల తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం వల్లనే ఆజాద్ వెనక్కి తగ్గి ఉండవచ్చునని భావిస్తున్నారు. బిజెపి కూడా తీవ్రంగా వ్యతిరేకించడం కూడా ఆజాద్ వెనక్కి తగ్గడానికి కారణమైందని అంటున్నారు. బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం కష్టమవుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నికల లోగా ఏర్పాటు చేయాలనే కాంగ్రెసు అధిష్టానం వ్యూహం బెడిసికొట్టే పరిస్థితి వచ్చింది. దీంతో ఆజాద్ వెనక్కి తగ్గక తప్పలేదని అంటున్నారు.