-->

చిన్నబోయిన గౌతముడు

 

 

శాంతి కాముని కళ్ళెదుట
రక్తపాతం. ఏం చేద్దాం?

 

పదవుల ఆశ తప్ప
మరింకేమి పట్టని నేతలకీ
ఆ 'అహింసా మూర్తి' ఎంతగా
విలవిలలాడిపోయుంటాడో ఏం తెలుస్తుంది?

అందరికీ 'అహింసా రుచి' చూపించాననే
గర్వంతో అంత ఎత్తున నిలబడి
చిరునవ్వులు చిందిస్తున్న 'గౌతముడు'
చిన్నబోయి చిరునవ్వు కోల్పోయి...

అవును! మనది భారతదేశమే.
అందుకే ఇక్కడ మాత్రమే ఇలా జరుగుతుంది.

......రమ

Teluguone gnews banner