Read more!

అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం.. జాతి విద్వేష దురహంకారం!

అమెరికాలో గాంధీ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. జాతి విద్వేష దురహంకారంతోనే ఈ చర్యకు పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  న్యూయార్క్‌ సౌత్‌ రిచ్‌మండ్‌ హిల్‌లోని శ్రీ తులసీ మందిర్‌ ఎదుట ఉండే మహాత్మా గాంధీ విగ్రహంన్ని కొందరు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సుత్తితో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ఆ ఫుటేజీల్లో స్పష్టం అవుతోంది. మొదట ఒకరు గాంధీ విగ్రహ ధ్వంసానికి పూనుకోగా, ఆ తరువాత  మరికొందరు వచ్చి  చేరారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తరువాత వారంతా రెండు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు.

 ఈ దారుణానికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారంతా పాతిక, 30 ఏళ్ల మధ్యవయస్కులేనని చెబుతున్నారు. కాగా ఈ ఘటనను భారత్ తీవ్రండగా ఖండించింది.  న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళింది.

న్యూయార్క్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి అవమానం జరగడం గడిచినరెండు వారాల్లో ఇది రెండో సారి. తాజాగా దాడిలో  దుండగులు పెయింట్‌తో విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు.  ఆగస్టు 3న కూడా ఇదే విగ్రహంపై దాడి జరిగింది.

గాంధీ విగ్రహంపై దాడి ఘటనను న్యూయార్క్‌ స్టేట్‌ అసెంబ్లీ సభ్యుడు జెన్నిఫర్‌ రాజ్‌ కుమార్‌ ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు. దుండగులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు.