గల్లా అరుణ పొలిటికల్ రీ ఎంట్రీ?
posted on Aug 7, 2023 @ 12:33PM
మాజీ మంత్రి, సీనియర్ పాలిటి షియన్ గల్లా అరుణకుమారి పాలిటికల్ రీ ఎంట్రీకి సిద్ధమవు తున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా క్రియాశీలక రాజకీ యాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె, ఇప్పుడు మళ్లీ పాలిటికల్ గా యాక్టివేట్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను నిర్వర్తించిన గల్లా అరుణకుమారి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ తర్వాత పరిణామాల్లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగు దేశం పార్టీలో చేరి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంతకు ముందు అదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన అరుణకుమారి 2014లో తెలుగుదేశం పార్టీలో కుమారుడు గల్లా జయదేవ్ తో కలిసి చేరారు. గుంటూరు ఎంపీగా తనయుడు గల్లా జయదేవ్ కు టికెట్ ఇప్పించారు. గుంటూరు నుంచి ఎంపీగా గల్లా జయదేవ్ రెండుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం లో కూడా కీలకమైన గుంటూరు నుంచి ఆయన విజయం సాధించి టీడీపీ జెండాను ఎగురవేశారు. అయితే గల్లా అరుణకుమారి మాత్రం 2014 ఓటమి అనంతరం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత ఏడాది జూన్ లో టీడీపీ పాలిటీబ్యూరో పదవికి కూడా రాజీనామా చేసినప్పటికీ పార్టీకి మద్దతు ప్రకటించారు. తన తనయుడు జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో తాను రాజకీయాలకు దూరంగా ఉండటానికి నిశ్చయించుకున్నట్లు ఆనాడు చంద్రబాబుకు తెలిపారు. దీంతో టీడీపీ అధిష్టానం చంద్రగిరి బాధ్యతలను మరో సీనియర్ నేత పులివర్తి నానికి అప్పగించింది. 2019 ఎన్నికల్లో నానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ వైసీపీ నేత డెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గం పార్టీ బాధ్యుడిగా పులివర్తి నానినే కొనసాగుతున్నారు. అయితే ఆనాటి పరిణామాల నేపథ్యంలో ఒక దశలో అరుణకుమారి తన రాజకీయ శకం ముగిసిందని వ్యాపార బాధ్యతలు నిర్వ ర్తించేందుకు పాలిటిక్స్ కు దూరమవుతున్నట్లుగా ప్రకటన కూడా చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ టీడీపీకి మద్దతుగానే ఉంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అధిష్టానం టికెట్ టికెట్ కేటాయిస్తే ఆమె చంద్రగిరి నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎంతో కీలకమైన గల్లా కుటుంబం నుంచి చంద్ర గిరిలో పోటీచేసినట్లయితే విజయం నల్లేరు మీద నడకేనని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కొందరు చెబుతున్నారు. ఇంకోవైపు గల్లా అరుణకుమారి సన్నిహితుల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టా నం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లో నెలకొంది.