లైవ్ లో యువతి ఆత్మహత్య..
posted on May 12, 2016 @ 3:09PM
తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ అందరికి హడలిపుట్టింటి ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా.. దక్షిణ పారిస్ లోని ఇగ్లీలో.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇగ్లీలోని 19 సంవత్సరాల యువతి అత్యాచారానికి గురైంది. దీంతో జీవతంపై విరక్తి చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే ఆమె పెరిస్కోప్ అనే యాప్ ద్వారా తన ఆత్మహత్యను ప్రత్యక ప్రసారం చేసి.. ఇగ్లీలోని సబర్బన్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకొని.. అందులోని వీడియోలను పరిశీలిస్తున్నారు.
కాగా పెరిస్కోప్ యాప్ ద్వారా ట్విట్టర్ ఖాతాదారులు లైవ్ వీడియోలను చూసే అవకాశం ఉంది. లైవ్ వీడియోలను వీక్షించేందుకు, షేర్ చెయ్యడానికి ఈ యాప్ 24 గంటలు అందుబాటులో ఉంది.