ప్లాస్టిక్ వాడితే 500 రూపాయల ఫైన్..
posted on May 12, 2016 @ 2:46PM
ప్లాస్టిక్ వాడితే ప్రాణానికి హాని అని అందరికి తెలిసిన విషయమే. కానీ తెలిసినా వాటిని వాడకుండా ఉండలేం. ఏదో ఒక రూపంలో దానిని ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ప్లాస్టిక్ ను వాడితే 500 రూపాయలు జరిమానా విధించాలని.. ఇదే చర్యను రెండుసార్లు చేస్తే 1000 రూపాయలు జరిమానా విధించాలని కమిషనర్.. మంజునాథ్ ప్రసాద్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలకు కూడా.. ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, బ్యానర్స్ కానీ తయారుచేసినట్టయితే వారికి 5 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని కూడా చెప్పారు. ఇలాంటి పద్దతిని కేరళలో గత ఏడాది, సెప్టెంబర్ నెల నుండి అమలు పరుస్తున్నారని.. అక్కడ ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడితే 5వేల రూపాయలు జరిమానా.. ఇంకా ఎక్కుసార్లు అయితే జరిమానా 25 వేల రూపాయలు వరకూ ఉంటుందని తెలియజేశారు.
ఇంకా ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు.. క్లాత్ షాపింగ్ బ్యాగ్స్ వాడాలని.. డ్రింక్స్ లాంటివి తాగేటప్పుడు స్ట్రాలను అవాయిడ్ చేయాలని.. వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ లాంటివి వాడకూడదని సూచించారు. మరి ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.