Read more!

దేవెగౌడకి పిచ్చెక్కిందా?

 

 

 

మాజీ ప్రధాని దేవెగౌడకి పిచ్చిగానీ ఎక్కిందా అనే సందేహాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. దేవెగౌడ ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకున్నందువల్ల ఏ అర్హత లేకపోయినా అప్పట్లో దేశ ప్రధాని అయ్యారు. మన దేశానికి ప్రధానులుగా పనిచేసిన వారిలో అత్యంత అసమర్థుడన్న అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నారు. ప్రధానమంత్రిగా పనిచేసినంతకాలం నిద్రపోవడం మినహా మరేమీ చేయని ప్రధానమంత్రిగా ఆయనకి పేరొచ్చింది. అలాంటి దేవెగౌడ ఈ ఎన్నికల తర్వాత తాను మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వుందని ప్రకటించడం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మంచి మేటర్‌ ఇచ్చింది.


దేవెగౌడ చెప్పేదాని ప్రకారం దేవెగౌడ పార్టీకి 12 ఎంపీ సీట్లు వస్తే చాలు. ప్రధానమంత్రి పీఠం మీద తాను మళ్ళీ కూర్చుంటారు. ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్న నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఆ పదవి మీద కూర్చునే అర్హత లేదని, తనకు మాత్రమే అర్హత వుందని ఆయన చెప్పారు. 

దేవెగౌడ వ్యక్తం చేసిన ఈ అతి విశ్వాసాన్ని అతి తెలివితేటలు అనాలా, అమాయకత్వం అనాలా అని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క దేశమంతా మోడీ ప్రభంజనం వీస్తుంటే దేవెగౌడకి మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలన్న కోరిక పుట్టడం, ఆ కోరిక తీరుతుందని నమ్ముతూ వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వారు అంటున్నారు.