శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా..మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
posted on Aug 9, 2025 @ 4:30PM
మేడ్చల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునే ఆలోచనలో ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా.. తన అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్న అనంతరం ఇవాళ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాఖీ పండగంటే తనకు ఎంతో ఇష్టమన్న మల్లారెడ్డి.. ఈ పండుగ నాడే తన ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభించానని తెలిపారు.
తనకు 73 సంవత్సరాలు వచ్చాయని... ఈ వయసులో ఏవైపూ చూడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని... ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. ఆ తర్వాత రాజకీయం వద్దనుకుంటున్నానని... ప్రజలకు సేవ చేస్తూ కాలేజీలు, యూనివర్శిటీలు నడిపిద్దామనుకుంటున్నానని తెలిపారు. రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని.. తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని మల్లారెడ్డి చెప్పారు.ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యా. ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటా’’ అని చెప్పుకొచ్చారు.