ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్..20 శాతం డిస్కౌంట్
posted on Aug 9, 2025 @ 5:11PM
ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఫెస్టివల్ సమయాల్లో రద్దీ దృష్ట్యా రౌండ్ ట్రిప్ ప్యాకేజీ స్కీమ్ కింద రిటర్న్ ఛార్జీలపై డిస్కౌంట్‌ను ప్రవేశపెట్టింది. 20 శాతం రాయితీ ప్రకటించింది. ఆక్టోబర్ 13 నుంచి 26 మధ్య ఏ ప్రాంతానికైనా ప్రయాణించి తిరుగు ప్రయాణం నవంబర్ 17నుంచి డిసెంబర్ 1 మధ్య ప్రయాణం చేసే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ నెల 14న తేదీ నుంచి ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేశాక టిక్కెట్ రద్దు చేస్తే డబ్బులు రావు.
పండుగల సమయంలో ఒక వైపుకు ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పథకం ద్వారా రెండు వైపులా రైళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ ఉద్దేశం. దీనివల్ల ప్రత్యేక రైళ్లకు కూడా బుకింగ్ ఆశించిన స్థాయిలో ఉంటుందని భావిస్తోంది. ఆన్ లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
రైల్వే బుకింగ్ వెబ్‌సైట్‌లోని ‘కనెక్టింగ్ జర్నీ’ ఫీచర్ ద్వారా ప్రయాణికులు ఈ స్కీమ్‌ను ఉపయోగించకోవచ్చు. అయితే, వెళ్లడానికి, తిరుగు ప్రయాణానికి ఒకేసారి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికుల వివరాలు, ప్రయాణించే క్లాస్, బయలుదేరే స్థానం, గమ్యస్థానం ఒకేలా ఉండాలి. రెండు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయితే డిస్కౌంట్ వస్తుంది. ఈ పథకం కింద రిటర్న్ టికెట్ బుకింగ్ చేసేటప్పుడు సాధారణంగా ఉండే 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ కాలపరిమితి (ఏఆర్‌పీ) వర్తించదని రైల్వే శాఖ తెలిపింది