నివాస ప్రాంతంలో కుప్పకూలిన విమానం.. ఎనిమిది మంది మృతి
posted on Nov 22, 2022 @ 9:33AM
కొలంబియాలో ఓ హెలికాప్టర్ నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్నఎనిమిది మందీ దుర్మరణం పాలయ్యారు. కొలంబియాలోని అతి పెద్ద నగరాలలో ఒకటైన మెడెలిన్ లో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బెలెన్ రోసేల్స్ సెక్టార్‌లో ఈ విమాన ప్రమాదం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు.
విమానం టేకాఫ్‌లో ఇంజిన్ వైఫల్యంతో ఒలాయా హెర్రెరా విమానాశ్రయానికి తిరిగి వెళ్లే సమయంలో కూలిపోయిందని చెబుతున్నారు. సామాజిక మాధ్యమంలో ఈ ప్రమాదానికి సంబంధించిన చిత్రాలను ఎమర్జెన్సీ సర్వీసెస్ షేర్ చేసింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. ఇళ్ళ పైన నల్లటి పొగ దట్టంగా కమ్ముకున్నట్లు చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తోంది.