నాడూ నేడూ ఐదూళ్లే సమస్య!
posted on Jul 25, 2022 @ 11:07AM
ఈ ఐదు అంకే చాలా చిత్రం. పూర్వం ఐదూళ్లివ్వండి మా బతుకులు మేం బతుకుతాం, ఈ భోగాలేమీ అక్కర్లేదన్నారు పాండవులు. ఐదూ లేదు ఏమీ లేదు పొండ్రాబయ్..అన్నాడు దుర్యోధనుడు, ఫలితంగా కురుక్షేత యుద్ధం. ఆ తర్వాత సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అత్యాధునిక కాలంలో కూడా ఓ ఐదూళ్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలనొప్పి తెస్తున్నాయి. ఆ ఐదూళ్ల నూ పక్కనే ఉన్న తెలంగాణా రాష్ట్రంలో కలపాలని ఆ ఊళ్ల వారే డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రజాభీష్టం. దీనికి సర్కారువారు అంగీకరించాలి గదా.. అసలు ఆ ఊళ్ల వారు ఏపీ మాకొద్దు బాబోయ్ అంటూ తెలంగాణ వైపు చూడడానికి ఏపీ సీఎం జగన్ నిర్వాకమే కారణం అని విమర్శలకులు అంటున్నారు.
రెండుగా తెలుగు రాష్ట్రం విడిపోయిన మొదటి ఐదేళ్లు అభివృద్ధిలో, ఆదాయంలో, ర్యాంకింగ్ లలో తెలంగాణలో పోటీపడి దూసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఆ తరువాత ఈ మూడేళ్ల కాలంలో అన్ని రంగాలలో వెనుకబడిపోయింది. జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ దుస్థితి గురించి ఎవర్నిడిగినా చెబుతారు. వచ్చాడయ్యో సామీ అని పాడుకున్నవారంతా ఇప్పుడు నాలిక్క ర్చుకుంటున్నారు. పెద్దాయన్ని (చంద్రబాబు) కాదని పొరపాటే చేశామని తెగ బాధపడుతున్నారు. అసలు ఏ మాత్రం ప్రజల అభ్యర్ధనలు, సమస్యలు పట్టనట్టే జగన్ వ్యవహరిస్తున్నారు. కేవలం ప్రచార పటాటోపంతో పాలన సాగిస్తున్నారంటున్నారంతా. విలీన మండలాల్లోని ఐదు గ్రామాల ప్రజలు తమ గ్రామాల్ని తెలంగాణాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో ఐదు పంచాయతీలు తీర్మానాలు చేశాయి. అవన్నీ వైసీపీ మద్దతుదార్ల పంచాయతీలు కావడంతో తర్వాత రెండు , మూడు గ్రామాల కు చెందిన కొంతమంది ప్రతి నిధులతో అలాంటి తీర్మానాలు చేయలేదని చెప్పించారు. కానీ ఇప్పుడు ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఆంధ్రా -తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో రాస్తారోకో చేశారు. తమ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని నడిరోడ్డుపై బైటాయించి భారీ ఎత్తున ధర్నా చేశారు. ‘జై తెలంగాణ.. ఆంధ్రా వద్దు – తెలంగాణ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలో పిచ్చుకలగూడెం, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామాల ప్రజలు భారీగా పాల్గొ ని, తమను భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేశారు.
ఎవరన్నా సమస్య వస్తే గ్రామపెద్ద దగ్గరికి వెళ్లేవారు, కాకుంటే కలెక్టర్ దగ్గరికి వెళ్లేవారు. కానీ ఈ ఐదు గ్రామాలు ఆంధ్రా, తెలంగాణా మధ్య ఉండడంతో దగ్గరలోని ఆంధ్రా ప్రాంత కార్యాలయం కంటే 40 కిలీమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం వెళ్లడానికే ఇష్టపడుతున్నారు. గోదావరి వరద సమయంలో కూడా ఈ ఐదు గ్రామాల వారిని జగన్ ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. అత్యంత అవసర సమయంలో, ప్రాణాలు గుప్పి ట్లో పెట్టుకున్న సమయంలో ప్రభుత్వం, అధికారులకు పట్టనపుడు ఈ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు పట్టించుకుంటారు. మున్ముందు వీరితో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయోనన్న భయంతోనే ఇపుడు తెలంగాణాయే ముద్దు అని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. మహాప్రభో.. మీరు వద్దు, మీ పాలనా వద్దని తమను కేసీఆర్ నీడలోకే పంపేయమని ఏకంగా డిమాండ్ చేస్తున్నారు.
తమ గ్రామాలను భద్రాచలం జిల్లాలో కలిపితేనే సమస్యలు తీరుతాయన్నది వారి నమ్మకం. ఒక పాలనను ఈ విధంగా ప్రజలే ఘోరంగా తిరస్కరించడం దక్షిణాదిలో ఇదే తొలిసారి కావచ్చు. రాజకీ య సమస్యల కంటే సామాజిక సమస్యలు ప్రజలే స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పుకోగల్గుతారన్నది ఈ ఐదు గ్రామాల డిమాండ్ స్పష్టం చేస్తోంది. ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కూడా గోదావరి కరకట్ట కట్టడానికి ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలన్నారు. సాంకేతికంగా సాధ్యం కాదని తెలిసినా ఈ అం శాన్ని రోజు రోజుకు హైలెట్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఇక ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఆ ఐదు గ్రామాలవారినీ తమ ప్రాంతంలోకి తీసుకోవడం పై చర్చిం చాలి. ఇదేమీ దుస్తులో, వస్తువులో, పుస్తకాలో మార్చుకున్నంత సులభమేమీ కాదు. ఒకసారి విభజన జరి గిన తర్వాత ఇపుడు ఏకంగా గ్రామాలను తమ రాష్ట్రంలోకి విలీనం చేయడమన్నది కేంద్రం అంగీకరించా లి. కానీ ఇక్కడ తిరకాసేమంటే అసలు వారిని రెచ్చగొడుతున్నదే తెలంగాణా ప్రభుత్వమన్న అభిప్రాయా లు బలంగా వినిపిస్తున్నాయి. అక్కడి ప్రభత్వం ఆ గ్రామాలను నిర్లక్ష్యం చేస్తోందని కేంద్రానికి తెలిసేలా నాటకాలు ఆడుతోందనే అనుకోవాలి. ఇక అధికారం ఉన్నది కొద్దికాలమే గనుక ఈ కుంపటి ఇలా మండే లా కొనసాగించి అప్పుడపుడు నవ్వుతూ కొన్ని బొగ్గులు వారిచేత వీరిచేత వేయిస్తుంటే ఆనక చట్ట సవరణ గురించి ప్రస్తావించవచ్చన్నది తెలంగాణా వ్యూహమూ కావచ్చునేమో!