ఎలిజబెత్-2 రాణికి అంతిమవీడ్కోలు
posted on Sep 20, 2022 @ 9:55AM
రాజకుటుంబం సమక్షంలో ఎలిజబెత్-2 అంత్య్రకియలు సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ దేశాధినేతలు, ప్రత్యేక ఆహా్వనితులు రెండువేలమంది పాల్గొన్నారు. కింగ్ చార్లెస్-3 ఆధ్వర్యంలో వెస్ట్ మినిస్టర్ హాల్‌లో క్యాటఫాక్‌పై నుంచి రాణి శవపేటికను విండర్స్ క్యాసల్ కు తరలించారు. ఈ కార్యక్ర మం లో యావత్ రాజ కుటుంబం పాల్గొంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల ప్రతినిధులు రాణికి నివాళులర్పించారు.
రాణి పార్థివదేహాన్ని రాయల్‌నేవీ స్టేట్ గన్‌క్యారేజీలో వెల్లింగ్టన్‌ఆర్చ్ మీదుగా విండర్స్ క్యాసల్‌కు తరలించారు. భారీ ఎత్తున జరిపిన ఎలిజబెత్-2 అంతిమ యాత్రలో ఆరు వేల మంది సాయుధులైన సైని కులతో మార్చ్ నిర్వహించారు. రాణి అంత్యక్రియలు ప్రారంభమైన వెస్ట్‌మినిస్టర్ హాల్ మొదలు.. రోడ్డుకు ఇరువైపులా పౌరులు దాదాపు 8 కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఎలిజబెత్-2కు నివాళిగా బ్రిటన్‌లో ఉద యం 8 గంటలకు ప్రజలంతా నిమిషం పాటు మౌనం పాటించారు. వెస్ట్‌మినిస్టర్‌లో రాణి పార్థివ దేహాన్ని ఖననం చేసే సమయంలో కూడా ప్రపంచ నేతలు రెండేసి నిమిషాల పాటు మౌనం వహించి, ఆమె ఆత్మ శాంతికి ప్రార్థనలు చేశారు. కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శి బారోనెస్ ప్యాట్రిసియా, బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ బైబిల్ వాక్యాలను పఠించి, కీర్తనలు అలపించారు. రాణి అంతిమ యాత్ర సందర్భంగా లండన్‌లోని బిగ్ బెన్ గంటను ఎలిజబెత్-2 96 ఏళ్లు జీవించినదానికి గుర్తుగా నిమిషానికి ఒకసారి చొప్పున 96 సార్లు మోగిం చారు. క్వీన్ ఎలిజబెత్ తన 96వ ఏట స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‌లో ఈ నెల 8న మరణించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ‘గాడ్ సేవ్ ద కింగ్’ అనే బ్రిటన్ జాతీయ గీతాన్ని ఆలపించారు.
వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో రాణి అంత్యక్రియలు ప్రారంభమవ్వడానికి ముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురు దేశాధినేతలతో మాట్లాడారు. వారిలో టాంజానియా అధ్యక్షుడు సమియా సులుహూ హసన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఉన్నారు. షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహెనాతో ముర్ము భేటీ అయినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి వెంట విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా ఉన్నారు.