రైతుల దీక్షకు వెళ్లకుండా టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకుల అరెస్టు
posted on Sep 20, 2022 @ 10:14AM
లేపాక్షి భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం సోమవారం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నంచేశారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం, రైతు, ప్రజా సంఘాల నాయకులను ఎక్కడిక క్కడ నిర్బంధించారు. లేపాక్షి నాలెడ్జ్‌హబ్ నిర్వాసిత రైతుల హక్కుల పరిరక్షణ వేదిక, అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నుంచి కొడికొండ చెక్‌పోస్టు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించగా, పోలీసులు అనుమ తించలేదు. అయినా వెనక్కు తగ్గేది లేదని నాయకులు ప్రకటించారు. దీంతో పోలీ సులు ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, అరెస్టులు కొనసాగించారు. టీడీపీ శ్రీసత్య సాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని రొద్దం మండలం మరువపల్లిలో, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబి కా లక్ష్మీనారాయణను హిందూపురంలో హౌస్‌అరెస్ట్ చేశారు. దీక్షకు వెళుతున్న సీపీఐ నాయకులను హిందూపురంలో అడ్డుకుని, టూటౌన్ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. చిల మత్తూరు లో టీడీపీ, సీపీఎం నాయకులను అరెస్ట్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, ఇతర నాయకు లను అరెస్టుచేశారు. మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిని అనంతపురంలోని ఆయన నివాసం లో నిర్బంధిం చారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ, తెలుగు రైతు ఆధ్వర్యంలో సోమవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో కృష్ణాజిల్లా జగ్గయ్య పేట మండలంలోని బూద వాడకు చెందిన తెలుగు రైతు విభాగం విజయవాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గడ్డం హుస్సేన్, రాష్ట్ర టీడీపీ గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డితో పాటు మరో వ్యక్తికి చిల్లకల్లు పోలీసులు ఆదివారం రాత్రి నోటీసులు అందించారు.
అలాగే గంగపలగూడెంలో రైతులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో తల పెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతులు నిరాకరిస్తూ తెలుగు రైతు జిల్లా అధ్య క్షుడు చెరుకూరి రాజేశ్వరరావును సోమవారం పోలీసులు ఊటుకూరు గ్రామంలో హౌస్ అరెస్టు చేశారు. తెలుగు రైతు సంఘ జిల్లా నేతలురెడ్డిగూడెం: ప్రజా సమస్యల పరిష్కారానికి తలపెట్టిన చలో అసెంబ్లీని అడ్డు కోవడం ప్రభుత్వం నిరంకుశ ధోరణికి నిదర్శనమని తెలుగు రైతు సంఘ జిల్లా నాయకులు వేణుగోపాల రెడ్డి, రాయుడు వెంకటేశ్వర్లు అన్నారు. వారివురిని కూనపరాజుపర్వలో వారి నివాసాల వద్ద ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారు.