మనిషి ఎందుకు భయపడతాడు?
posted on Nov 12, 2021 @ 9:30AM
మనిషి భయ పడడానికి కారణం ఏమిటి? మనిషి తనను భయ పెట్టె ఆ అంశాలు ఏమిటి? దేనికి మనిషి ఎక్కువగా భయపడతాడు? భయం కేవలం ఒక ఘటనే ప్రభావితం చేస్తుందా? అన్న అంశాలు కేవలం బాయోలాజికల్ ఫియర్ దీనిని ఎలా మదింపు చేయాలి. అసలు మన శరీరంలో ఏమౌతోంది? అసలు మనం కొన్ని సందర్భాలలో ఎందుకు నియంత్రించు కోలేము. ఎందుకు కుంగి పోతాము. ధైర్యం చేస్తే భయాన్ని జయించ వచ్చా?
అందరు భయపడతారు...
భయాన్ని మనం తోసి పారేయలేము అన్నది మనుషులలో ఉండే భావాన. ప్రజలు సహజంగా భయం అనేది అసంతృప్తి తో కూడిన భావోద్వేగమా ? ఒక్కో సరి ఆద్వేగాలు బయటికి వస్థాయి.ఎదో ఒక్కోసారి మనం విమానం లోనుండి బయట పడిపోయి నట్టు.నిద్రలో మనం లోయలోకి జారి పడిపోయి నట్లు. పడుకున్న ప్రదేశం లో కిటికీకి అవతలిపక్క చెట్టు గాలికి ఊగిన ఎదో తిరుగుతోందని అది దేయ్యమేనని అలాగే చూస్తూఉంది పోతారు.నీడను చూసి భయ పడతారు.ఉదాహరణకు మరో ఘటన పొద్దున్న ఒక వ్యక్తితో గొడవ అయ్యింది.రాత్రి నిద్రలో కూడా అదే గుర్తుకు వస్తూ ఆకుల అలికిడి శబ్దమైనా చీకట్లో ఎవరో ఉన్నారని ఒక్కసారి ఎలర్ట్ అయ్యి మెల్లగా నడుస్తూ ఆ నీడ ఎవరో పట్టుకోవాలి,వాడి అంతు చూడాలనే
సంకల్పం తో బయటికి వస్తారు అంతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆవచ్చిన వ్యక్తి తనను చంపడానికి వచ్చాడని నిర్ణయించుకుని ఏదైనా ఆయుధం తీసుకుని ఆవ్యక్తి ఎవరో చూడకుండా తెలుసుకోకుండా ఒక్క సారి దాడి చేసాడు కొద్ది సేపటి తరువాత చూస్తే ఆవ్యక్తి రక్తపు మడుగులో కొట్టుకోవడం చూసాడు అంటే ఒక్క భయం బ్రమగా మారింది మనసులో ఊహించుకున్న ఆవ్యక్తి తానే చంపేందుకు వచ్చాడన్న భావన మనసులో నాటుకు పోయింది.ఫలితం తనకు తెలియకుండానే హాత్య జరిగిపోయింది.
మన బలం బలహీనత భయం....
భయం రావడం సహజం,ఏదైనా ఎవరైనా మీ ఇంట్లో శబ్దం వచ్చినప్పుడు.నువ్వు ఒక్కడివి మాత్రమే ఉన్నప్పుడు.అలా జరిగిందంటే కొంతవరకూ విలువైనదిగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో సరైన దే కావచ్చు.అసమంజసంగా ఉండవచ్చు. ఏదైనా చిత్రం లో కనపడ్డ మేక్ అప్.కస్త్యుం లో చూసి భయపడడం సహజం.ఆవ్యక్తిని లేదా ఆపాత్రని అదే పనిగా చూసినప్పుడు.భయపడతారు. తాడును చూసి పాముఅనుకుని భయం.కొందరికి నీళ్ళను చూసి భయం.గోడపైన నీడకదిలినా, చిన్న పేపరుముక్కను చూసినా భయామే.ఇంట్లో బల్లులు.ఇతర జంతువులు చూసినా భయమే. కొన్ని కొన్ని వస్తువులు జంతువులు మనిషి మనస్సులో భయాన్ని ప్రేరేపిస్తాయి.తీవ్రప్రభావం చూపిస్తాయి.
భయం వల్ల శరీరం లో ఏమౌతుంది....
ప్రజలలో తరచుగా మానసికంగా వచ్చే మార్పులు వల్ల భయపడతారు. చిన్న పాటి గొడవకే భయానికి
లోనౌతారు.దీనివల్ల ఉచ్వాస, నిశ్వాసలు, పెరుగు తాయి.గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్త నాళాలలో
రక్త ప్రసారం వేగం పెరుగు తుంది.చర్మం పై జుట్టు నిక్క బోడుచుకుంటుంది.శరీరం లోని ఇతర అవయవాలు తీవ్రంగా స్పందిస్తాయి.శరీరానికి ఆక్సిజన్ న్యూట్రియాంట్స్ కండారాలు రక్త ప్రసారాలు సాగిస్తాయి. ఘటన జరిగిన వెంటనే స్పందిస్తాయి.
భయం వల్ల కండరాలు ఎలా స్పందిస్తుంది ....
శరీరం లోని ప్రతి వెంట్రుక నిక్క బోడుచుకుంటుంది.దీనికి కారణం పైలో రీయక్షన్ దీనినే గూస్ బంప్స్ అంటారు. అందుకే మనవ శరీరం లోని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.అది విచిత్రంగా ఉంటుంది. మేతాబలిక్ గా శరీరం లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగు తాయి.అవసరమైన పక్షం లో అది శక్తిని నిల్వ చేస్తుంది. ప్రతి చర్యకు దిగుతుంది.అలాగే కాల్షియం,తెల్ల రక్తకణాలు పెరుగు తాయి.
భయపద్దప్పుడు మనం ఎందుకు నిలబడి పోతాము....
అనుకోని సంఘటన చూసినప్పుడు మనం అలాగే ఆస్చాయానికి లోను అవుతాంఅలాగే భయ పడి పోతాము. ఒక్కో సారి అలాగే అసలు ఏమైందో అర్ధం కాక విగ్రహంలా నిలబడి పోతారు.కొద్ది సేపటి తరువాత గాని సంఘటన నుంచి తెరుకోము.ఇక కారు చీకటి అడవి పైగా ఒక పెద్ద పులి కనపడిందా మనం ఏమాత్రం జరిగినా కదిలినా దాడి చేస్తుంది.ఇకా పాము కంట పడితే ఏమాత్రం కదిలినా కాటు తప్పదు అప్పుడు మనం జంతువుకు ఆహారం కాక తప్పదు. అని భావిస్తారు. ఆసమయం లో ఆవ్యక్తి మానసిక శారీరక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం ఆసాధ్యం.ఆ సంఘటన తో గుండె జబ్బు ఉన్న వాళ్ళు గుండెపోటుకు గురికావడం ఆఘటన మానసికంగా మనసులో ఉండి పోయి మానసికంగా కుంగి పోతారు నిద్రలో కలవరిస్తూ ఉంటారు. ఏది చూసిన అలాగే భయానికి గురి అవుతారు. కొన్ని సందర్భాలలో కదల కుండా అలా ఉండి పోవడమే ఉతమ మైన ఆలోచన ఎందుకంటే ప్రాణాలు కాపాడు కోవచ్చు.
2౦14 లో నిర్వహించిన పరిశోదనలో న్యురోలాజికల్ వచ్చే స్పందన వల్ల అలాగే ఉండి పోతారని మానసిక శాస్త్ర వేత్తలు ఉండిపోతారు.అప్పుడు మెదడులోని రెండు భాగాల మధ్య తర్జన భర్జన జరుగుతుంది.రకరకాల సంకేతాల ద్వారా జంతువులు కూడా అలాగే ఉండిపోతాయి.దీనికి కారణం యాంగ్జయిటీ డిజైర్ అది కేవలం భయం తో నిలిచిపోతారని అంటున్నారు మానసిక వైద్యులు. భయం నీడలో ఉన్నంతకాలం బిక్కుబిక్కు మంటు భయం తో ఉంటాము. ఒక్కసారి భయం పోయిందా అన్నిటా విజయం సాధిస్తాం.మానసిక అనారోగ్యమే భయం,ఫోబియా.భయం ఫోబియా అంటుకుందో పోదు.అవసరమైన పక్షం లో మానసిక వైద్యుడిని సంప్రదించండి భయం నుండి బయటకు రండి