ఫేస్‌బుక్‌తో ప్రాబ్లమ్స్ చూతము రారండీ
posted on Jun 21, 2014 @ 5:42PM
సోషల్ నెట్ వర్క్ ఫేస్‌బుక్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలూ వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కి సంబంధించిన వివాదాలు, కేసులు, మోసాలు గట్రా ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి. లేటెస్ట్.గా వెలుగులోకి వచ్చిన రెండు ఇష్యూలని చూద్దాం. అస్సాంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు తమ తోటి అమ్మాయిల ఫొటోలు, అడ్రసులు, ఫోన్ నంబర్లు ఫేస్‌బుక్‌లో పెట్టి వాళ్ళకి అసభ్య ఫోన్ కాల్స్ వచ్చేలా చేశారు. అసభ్యకరమైన ఫోన్ కాల్స్ అందుకున్న అమ్మాయిలు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు చేసిన దర్యాప్తులో ఇద్దరు ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిలు చేసిన నిర్వాకం బయటపడింది. దాంతో ఆ ఇద్దరమ్మాయిలు షేమ్‌గా ఫీలయి ఇద్దరూ జాయింట్‌గా ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. సమయానికి కాపాడటంతో ఇద్దరికీ చావు తప్పింది. ఇద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అలాగే విజయవాడకి చెందిన ఒక వ్యక్తి ఒక సినిమా నటి పేరు మీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ అకౌంట్లో ఆమె ఫొటోలు పెట్టాడు. ఆమె పేరుతో తానే అందరికీ టచ్‌లోకి వెళ్ళాడు. కొంతమంది మగాళ్ళను టార్గెట్ చేశాడు. అనాథాశ్రమమని, అన్నదానమని ఆమాట ఈమాట చెప్పి వాళ్ళ దగ్గర కొంత డబ్బు వసూలు చేశారు. అయితే సదరు నటి ఈ విషయాన్ని కనిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతగాడిని అరెస్టు చేసి లోపలేశారు.