ఈజిప్టులో 183 మందికి ఉరి?
posted on Jun 21, 2014 @ 5:04PM
ఈజిప్టులో 183 మందికి ఒకేసారి ఉరిశిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈజిప్టు కోర్డు దీనికి సంబంధించిన తీర్పు ఇచ్చింది. ఈజిప్టులో ముస్లిం బ్రదర్‌హుడ్ అనే ఛాందసవాద సంస్థ వుంది. ఈ సంస్థకి నాయకుడు మహ్మద్ బడీ. ఈయన ఒక మాట చెబితేచాలు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా వుండేవారు వందలమంది వున్నారు. కొంతకాలం క్రితం వీరు ఈజిప్టులో భారీగా అల్లర్లు జరగడానికి కారణమయ్యారని, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని చంపారన్న ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణల మీద కోర్టు విచారణ జరిపింది. ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ అల్లర్లకు, పోలీస్ ఆఫీసర్ మరణానికి కారణమని నిర్ధారించింది. దాంతో ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ అధ్యక్షుడు మహ్మద్ బడీతోపాటు, ఆయన మద్దతుదారులైన 182 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ శిక్ష ఎలాంటి అడ్డంకులూ లేకుండా అమలైతే ఈజిప్టులో త్వరలో 183 మందికి ఉరిశిక్ష అమలు చేస్తారు. అయితే మహ్మద్ బడీ నియమించుకున్న లాయర్లు మాత్రం అంత సీన్ లేదని అంటున్నారు. ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమీ ఫైనల్ కాదని, ఈ కోర్టు పైన చాలా కోర్టులు వున్నాయని వాటిలో ఈ తీర్పును సవాల్ చేస్తామని అంటున్నారు.