హద్దుమీరిన ఆకతాయితనం
posted on Nov 3, 2022 @ 10:19AM
స్నేహితులు సరదాగా మాటలు అనుకోవచ్చు, కొట్టుకోవచ్చు. సరదాలు పట్టించడానికి కూడా ఒక హద్దు ఉంటుందనేది ఈరోజుల్లో కుర్రాళ్లకు చెప్పలేని ఆకతాయితనం గమనిస్తున్నాం. చిన్నపాటి సరదాలు కొట్లాట్లకు, ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. మొన్న దీపావళి రోజున ఓ కుర్రాడు టపాసును తన స్నేహి తుడి మర్మాంగం దగ్గర పెట్టి కాల్చాడు. ఆ కుర్రాడు గాయపడి ఆస్పత్రిపాలయ్యాడు. ఇంతటి దారుణం సరదా ఎలా అవుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. కుర్రాళ్లు ఇంతటి అన్యాయమయిన వికృత చేష్ట లను సరదా అని ఎలా అనుకుంటారో తెలీదు. అదే తీవ్ర గాయాలయి మరణిస్తే ఏమయ్యేది అనే ఆలోచనతో ఇప్పుడు భయపడవచ్చు.
ఉత్తరప్రదేశ్ భిషన్పురా కి చెందిన కుర్రాడు తన స్నేహితులతో కలిసి దీపావళి టపాసులు కాల్చ డంలో ఎంతో సరదాగా గడుపుతున్నాడు. అంతా కేరింతలు, ఆనందం .. అక్కడి వరకూ బాగానే ఉంది. కానీ వారిలో ఎవరికో ఒక ఛండాలమైన ఆలోచన వచ్చింది. వెంటనే ఒక టపాసును బిషన్ పురా కుర్రాడి మర్మాంగం దగ్గరగా పెట్టే కాల్చాడు. ఆ కుర్రాడు విపరీత గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఇది తెలు సుకుని అతని తల్లిదండ్రులకు సమాచారం తెలియజేశారు. వారు బిషన్ పురాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు మేడ్చల్ పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయమై దర్యాప్తు చేయమని కోరారు. పోలీసులు ఆ పనిలో పడ్డారు.
పిల్లలు పిల్లల్లా ఉండాలి, స్నేహంతో సరదాల కంటే ఇలాంటి వెర్రి వేషాలు ఎంతో ప్రమాదకరం. వారికి ప్రమాదాల తీవ్రత తెలియకపోవడమేకాదు, కనీసం కామన్ సెన్స్ లేకుండా ఉండడమే ఆశ్చర్యకరం. చదువులు, తల్లిదండ్రుల భయం లేకపోతే పిల్లల ఆకతాయితనానికి అంతే ఉండదు.