చంద్రబాబు నివాసంలో ఎమోషనల్ సీన్స్
posted on Jan 25, 2023 @ 1:57PM
నారా లోకేష్ తన నివాసం నుంచి పాదయాత్ర కోసం బయలు దేరారు. ఆ సమయంలో ఆయన నివాసం వద్ద ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. భార్య బ్రాహ్మణి లోకేష్ కు వీర తిలకం దిద్ది సాగనంపారు. తల్లి భువనేశ్వరి ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికారు. లోకేష్ తండ్రి చంద్రబాబు, మామ బాలకృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.
నారా లోకేష్ తన నివాసం నుంచి పాదయాత్ర కోసం బయలు దేరారు. ఆ సమయంలో ఆయన నివాసం వద్ద ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. భార్య బ్రాహ్మణి లోకేష్ కు వీర తిలకం దిద్ది సాగనంపారు. తల్లి భువనేశ్వరి ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికారు. లోకేష్ తండ్రి చంద్రబాబు, మామ బాలకృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. లోకేష్ కోసం ప్రత్యేకంగా కార్వాన్ వాహనం సిద్ధం చేశారు. పాదయాత్రలో విశ్రాంతి, పార్టీ నేతలతో సమీక్షల కోసం కార్వాన్‌లో అధునాతన ఏర్పాట్లు చేశారు. ఈ కార్వాన్ వాహనం హైదరాబాద్ నుంచి కుప్పం బయలుదేరింది. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ ఆధ్వర్యంలో చంద్రబాబు నివాసం నుంచి భారీ బైక్ ర్యాలీతో లోకేష్ జూబ్లీహాల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన లోకేష్ అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని కడపకు బయలుదేరి వెళ్లారు. కడప నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు.
గురువారం (జనవరి 26) ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేరుకుంటారు. శుక్రవారం ఉదయం కుప్పంలోని వరద రాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన యాత్ర 400 రోజుల పాటు నాలుగువేల కిలోమీటర్లు సాగనుంది. ఆయన యాత్ర విజయవంతం చేయడానికి తెలుగుదేశం అన్ని ఏర్పాట్లూ చేసింది.