మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఎన్నికల షెడ్యూల్ ఇదే!
posted on Jan 18, 2023 @ 2:40PM
నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మేఘాలయ,నాగాలాండ్‌లలో కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడతాయని తెలిపింది.
నాగాలాండ్ శాసన సభ గడువు మార్చి 12తోనూ, మేఘాలయ అసెంబ్లీ గడువు మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ ముగియనున్న సంగతి తెలిసిందే. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారం (జనవరి 18) మీడియా సమావేశంలో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసన సభల ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు.
ఎన్నికల అక్రమాలపై సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి తెలియజేస్తే తక్షణమే స్పందిస్తామని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలంటే ప్రజా భాగస్వామ్యం తప్పని సరి అని ఆయన పేర్కొన్నారు.