ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది కొత్త ఎయిర్ పోర్టులు
posted on Sep 30, 2025 @ 11:02AM
ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన కనెక్టివిటీ విస్తరణ శరవేగంగా సాగుతోంది, రాష్ట్రానికి ఎనిమిది కొత్త విమానాశ్రాయాలు రానున్నాయి. ఇవి రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో గ్రామీణ ప్రాంతాలను అనుసం ధానిస్తాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణ, వాణిజ్య సదుపాయం గణనీయంగా మెరుగుపడుతుంది. రాష్ట్రంలో కొత్తగా శ్రీకాకుళం, తుని, తాడేపల్లిగూడెం, అమరావతి, ఒంగోలు, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్‌లలో విమానాశ్రయాలు రానున్నాయి. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లోకల్ ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపడమెరుగుపరచడం లక్ష్యంగా కొత్త విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, రాజమండ్రి, వైజాగ్‌లలో ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. మరో ఎనిమిది విమానాశ్రాయాలు త్వరలో రానున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల సంఖ్య 14కు పెరుగుతుంది. ఇక వీటికి తోడు.. విమానయాన రంగంలో వివిధ శాఖల నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలోజీఎంఆర్ ఏవియేషన్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఇది విమానయానరంగానికి అవసమైన నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందించేందుకు దోహదపడుతుంది.
రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కానీ నిర్వహిస్తాయి. రాష్టరంలో ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్టులలో విజయవాడ , విశాఖపట్నం తిరుపతిలు అంతర్జాతీయ విమానాశ్రయాలు కాగా మిగిలినవి లోకల్ ఎయిర్ కనెక్టివిటీకి దోహదం చేస్తున్నాయి.